సూర్య '24' షూటింగ్ పూర్తి...
Send us your feedback to audioarticles@vaarta.com
ఎప్పటి నుంచో తెలుగులో డైరక్ట సినిమా చేస్తానని చెబుతున్న సూర్య ఎట్టకేలకు తన మాటను నిలబెట్టుకుంటున్నారు. అందులో భాగంగానే 24` సినిమాను చేస్తున్నారు. ఇష్క్, మనం సినిమాలకు తెరకెక్కించిన విజయవంతమైన దర్శకుడు విక్రమ్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ సినిమా తెరకెక్కుతోంది. 2డీ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కుతోంది.
సమంత హీరోయిన్ గా నటిస్తుంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం చిత్రీకరణంతా పూర్తి చేసుకుంది. ముంబై, పూణే, చెన్నైలతో పాటు స్పెయిన్ లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంది. సైకలాజికల్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ చిత్రంలో సూర్య తాత, తండ్రి, మనవడి పాత్రలో కనిపించనున్నాడు. సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలకు సిద్ధమవుతోంది. సినిమాని అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసి సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని సూర్య అండ్ టీం యోచిస్తోంది. మరి తెలుగులో ఇప్పటికే పెద్ద చిత్రాలు సంక్రాంతి బరిలో ఉండటంతో 24 సినిమా సంక్రాంతికి విడుదలవుతుందా, లేక పోస్ట్ పోన్ అవుతుందా అని తెలియడం లేదు....
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments