సూర్య 24 టీజర్ రిలీజ్ డేట్...
Wednesday, March 2, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళ హీరో సూర్య నటిస్తున్న తాజా చిత్రం 24. ఈ చిత్రాన్ని మనం ఫేం విక్రమ్ కుమార్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో సూర్య మూడు డిఫరెంట్ పాత్రల్లో నటిస్తున్నారు. సూర్య సరసన సమంత, నిత్యామీనన్ నటిస్తున్నారు. సైంటిఫిక్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీని హీరో సూర్య నిర్మిస్తుండడం విశేషం. ఇప్పటికే 24 పోస్టర్స్ సినిమాపై మరింత క్రేజ్ పెంచాయి. ఇక ఈ సినిమా టీజర్ ను ఈనెల 4న రిలీజ్ చేయనున్నారు. తెలుగు, తమిళ్ లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 16న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. తెలుగులో 24 మూవీని హీరో నితిన్ రిలీజ్ చేయనున్నారు. మరి... మనం చిత్రం తర్వాత విక్రమ్ కుమార్ తెరకెక్కించిన 24 ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments