సూర్య 24 రిపోర్ట్ వచ్చేసింది..
Send us your feedback to audioarticles@vaarta.com
సూర్య - విక్రమ్ కుమార్ కాంబినేషన్లో రూపొందిన భారీ చిత్రం 24. ఈ చిత్రంలో సూర్య సరసన సమంత, నిత్యామీనన్ నటించారు. ఈ చిత్రాన్ని 2డి ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై సూర్య నిర్మించారు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన 24 మూవీని ప్రపంచ వ్యాప్తంగా ఈనెల 6న రిలీజ్ చేస్తున్నారు. అటు తమిళ్ ఇండస్ట్రీ - ఇటు తెలుగు ఇండస్ట్రీ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 24 మూవీ ఎలా ఉంది..? హైలైట్స్ ఏమిటి..? టోటల్ రిపోర్ట్ ఏమిటి..? అనేది తెలిసిపోయింది. అప్పుడే 24 రిపోర్ట్ ఎలా తెలిసిపోయిందంటారా..? బాలీవుడ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ 24 మూవీ ప్రివ్యూ చూసారు. ఈ సినిమా తరణ్ ఆదర్శ్ ని బాగా టచ్ చేసింది.
అందుకే 24 సినిమా ఎలా ఉందో తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ ద్వారా తెలియచేస్తూ...24 మూవీకి ప్రధాన బలం కథ. ఈ చిత్రంలో మూడు విభిన్న పాత్రల్లోను సూర్య మెప్పించాడు. ముఖ్యంగా విలన్ పాత్రలో సూర్య నటన అద్భుతం. అవార్డ్ విన్నింగ్ పర్ ఫార్మెన్స్ అందించాడు. డైరెక్టర్ విక్రమ్ కుమార్ మనం చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. మరోసారి తన బ్రిలియన్స్ తో మరో అద్భుత చిత్రాన్ని అందించాడు. సూర్య, సమంత మధ్య చిత్రీకరించిన సన్నివేశాలు, ఇంటర్వెల్ సీన్, ఎమోషనల్ సీన్స్... ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. 24 రన్ టైమ్ 2 గంటల 40 నిమిషాలు. ఈ సినిమా టైటిల్స్ దగ్గర నుంచి ఎండింగ్ టైటిల్స్ పడేవరకు ఇంట్రస్టింగ్ చూసేలా 24 చిత్రాన్ని అద్భతంగా తెరకెక్కించారు. హ్యాట్సాఫ్ టు 24 టీమ్ అంటూ తన స్పందన తెలియచేసారు. బాలీవుడ్ క్రిటిక్ ఈరేంజ్ లో 24 గురించి చెబుతుంటే...ఇక సినిమా ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments