ఫ్యాన్స్ కు సూర్య గిఫ్ట్

  • IndiaGlitz, [Saturday,March 12 2016]

సూర్య హీరోగా, నిర్మాతగా రూపొందిస్తున్న సైకలాజికల్ థ్రిల్లర్ 24. ఈ సినిమాలో సూర్య సరసన సమంత, నిత్యామీనన్ లు నటిస్తున్నారు. మనం ఫేమ్ విక్రమ్ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం సినిమా శరవేగంగా నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఈ చిత్రంలో సూర్య మూడు రోల్స్ చేసిన సంగతి తెలిసిందే.

రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా టీజర్ సోషల్ మీడియాలో, యూ ట్యూబ్ లో వైబ్స్ క్రియేట్ చేస్తుంది. లెటెస్ట్ న్యూస్ ఈ సినిమాలో ఓ సాంగ్ ఈ మార్చి 14న విడుదల చేయడానికి సూర్య ప్లాన్ చేశాడు. నిజంగా ఈ వార్త సూర్య అభిమానులకు సంతోషం కలిగించేదే. ఎ.ఆర్.రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు.