సీఎస్‌కే జట్టుకు మరో షాక్... జట్టు నుంచి రైనా అవుట్..

ఐపీఎల్‌కు సిద్ధమవుతున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. నిన్నటికి నిన్న జట్టులోని 13 మందికి కరోనా సోకినట్టు తేలింది. కాగా.. నేడు ఆ జట్టు స్టార్ ప్లేయర్ సురేష్ రైనా టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్టు వెల్లడించి షాకిచ్చాడు. అయితే తాను వ్యక్తిగత కారణాలతోనే జట్టు నుంచి తప్పుకుంటున్నట్టు రైనా ప్రకటించాడు. ఈ విషయాన్ని సీఎస్‌కే జట్టు ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ఈ సమయంలో తాము రైనాకు, ఆయన కుటుంబానికి పూర్తి మద్దతిస్తామని సీఎస్‌కే ట్వీట్‌లో పేర్కొంది.

కాగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఒకరిద్దరు కాదు ఏకంగా 13 మంది కొవిడ్‌ బారినపడ్డారు. వీరిలో పరిమిత ఓవర్లలో టీమిండియాకు ఆడిన ఓ యువ పేసర్‌ కూడా ఉన్నట్టు సమాచారం. ఆ యువ పేసర్ పేరు వెల్లడించక పోయినా ఆ క్రికెటర్‌ దీపక్‌ చాహర్‌ లేదా శార్దూల్‌ ఠాకూర్‌లలో ఒకరు కావొచ్చని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. అయితే యువ పేసర్ మినహా కొవిడ్‌ బారినపడిన మిగిలిన 12 మంది జట్టులోని సహాయక సిబ్బంది అని సమాచారం.

ఐపీఎల్‌ కొవిడ్‌ ప్రొటోకాల్‌ ప్రకారం.. యూఏఈలో అడుగుపెట్టగానే జట్లన్నింటికీ విమానాశ్రయంలోనే కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. అనంతరం వారందరినీ ఓ హోటల్‌లో క్వారంటైన్‌లో ఆరు రోజుల పాటు ఉంచి మూడు సార్లు కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే గురువారం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కరోనా పరీక్షకు హాజరైంది. వీరిలో మొత్తం 13 మంది పాజిటివ్‌గా తేలారు. దీంతో శుక్రవారం జట్టులోని మరింతమందికి పరీక్షలు నిర్వహించారు. వాస్తవంగా సీఎస్‌కే శుక్రవారం ప్రాక్టీస్‌ ప్రారంభించాల్సి ఉంది. 13 మందికి కరోనా నిర్ధారణ కావడంతో ప్రాక్టీస్ కొద్ది రోజుల పాటు వాయిదా పడింది. అలాగే సీఎస్‌కే జట్టు స్వీయ నిర్భంధం కూడా వచ్చేనెల ఒకటి వరకు కొనసాగనుంది.

More News

విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో నాగ‌చైత‌న్య 20వ చిత్రం 'థాంక్యూ'

యువ సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెకంటేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై "థాంక్యూ"

సడెన్‌గా హాట్ టాపిక్‌గా మారిన ఎమ్మెల్యే రాజాసింగ్..

తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సడెన్‌గా హాట్ టాపిక్‌గా మారారు. కారణం ఏంటంటే ఆయనకు ముప్పు పొంచి ఉందట.

సెల్‌ఫోన్ తీశాడనే నెపంతో యువకుడికి శిరోముండనం చేయించిన నూతన్ నాయుడు

సినీ నిర్మాత నూతన్‌కుమార్ నాయుడు తనకు శిరోముండనం చేయించారంటూ ఓ యువకుడు వీడియో విడుదల చేసి కలకలం సృష్టించాడు.

ఏపీలో విజృంభిస్తున్న కరోనా.. నేడు మరోసారి 10 వేలకు పైగా కేసులు

ఏపీలో కరోనా మరోమారు విజృంభిస్తోంది. కొద్ది రోజుల క్రితం వరుసగా 10 వేలు నమోదైన కేసులు మధ్యలో కాస్త తగ్గాయి.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వైద్యుల మాటలకు స్పందిస్తున్నారు: ఎంజీఎం

ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. కొద్ది రోజుల పాటు బాగానే ఉన్న ఆయన ఆరోగ్యం ఇటీవల విషమించిందని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు.