మరో కొరియన్ రీమేక్‌కి సురేష్ ప్రొడక్షన్స్ రంగం సిద్ధం
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ ప్రముఖ నిర్మాణసంస్థలో ఒకటైన సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డి.సురేష్ బాబు మరో కొరియన్ రీమేక్‌కి రంగం సిద్ధం చేస్తున్నారు. మరో రీమేక్ అని ఇక్కడ ప్రస్తావించడానికి కారణం.. ఇది వరకు ‘మిస్ గ్రానీ’ అనే కొరియన్ రీమేక్‌ను తెలుగులో ‘ఓబేబీ’ పేరుతో సమంత అక్కినేని ప్రధాన పాత్రధారిగా రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్‌ను సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ రీమేక్ చేస్తున్న కొరియన్ రీమేక్ మూవీ ‘లక్ కీ’. నిజానికి ఈ చిత్రం... జపనీస్ ‘కీ ఆఫ్ లైఫ్’ మూవీకి రీమేక్. ఈ సినిమాకు సంబంధించి అన్ని ఇండియన్ భాషల రీమేక్ హక్కులను సురేష్ ప్రొడక్షన్స్ కొనుగోలు చేసినట్లు సంస్థ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.
ఈ సినిమాను తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్‌తో కలిపి గురు ఫిలింస్ 1, ఎస్కే గ్లోబలెంట్ సంస్థలు నిర్మించనున్నాయి. ఓ ప్రముఖ యాక్టర్, దర్శకుడు ఈ రీమేక్‌లో నటించనున్నారు. ప్రస్తుతం తెలుగు నెటివిటీకి తగ్గట్లు స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com