దర్శకుడు సురేశ్ కృష్ణకు అరుదైన పురస్కారం

  • IndiaGlitz, [Friday,March 01 2019]

తమిళ సర్కార్ ప్రతిష్టాత్మకంగా 1968 నుంచి ‘కళైమామణి’ పురస్కారాలు అందజేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ ఈ పురస్కారాలు పేరు వినిపించింది. ఈ ఎనిమిదేళ్ల గ్యాప్‌‌లో వచ్చిన సినిమాలన్నింటినీ నిశితంగా పరిశీలించిన ‘కళామామణి’ కి సంబంధించిన పురస్కార కమిటీ సభ్యులు తాజాగా 210 మంది పేర్లను ఈ అవార్డులకు ప్రకటించింది. వీరిలో డైరెక్టర్ సురేశ్ కృష్ణ, ప్రొడ్యూసర్ ఏఎం రత్నం, నటుడు, డైరెక్టర్ ప్రభుదేవా, నటులు విజయ్ సేతుపతి, కార్తీ, నటి ప్రియమణి, మ్యూజిక్ డైరెక్టర్ యువన్‌శంకర్ రాజా, డైరెక్టర్ శశికుమార్‌, హాస్య నటుడు సంతానం తదితరులను ఈ ‘కళైమామణి’ వరించింది. తమిళనాడు సీఎం పళనిస్వామి ఈ పురస్కారాలను అందజేయనున్నారు.

కాగా.. 2013కి గానూ ఈ పురస్కారం హీరో కార్తీని వరించగా.. 2017కి గానూ విజయ్‌సేతుపతి ఈ పురస్కారానికి ఎంపికవ్వడం విశేషం. కూడా పురస్కారాన్ని అందుకోనున్నారు. గతంలో కమల్ హాసన్, రజినీకాంత్, విజయ్ కాంత్, ఇళయరాజా తదితర ప్రముఖులకు తమిళనాడు ప్రభుత్వం ఈ అవార్డులు దక్కాయి. ఇదిలా ఉంటే.. ‘కళైమామణి’ అవార్డులకు ఎంపికైన వారికి ఒక ప్రశంసాపత్రం, లక్ష రూపాయల నగదు అందజేయనున్నారు.

సురేశ్ కృష్ణ ట్రాక్ రికార్డ్..

డైరెక్టర్ సురేశ్ కృష్ణ గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 1953 జూన్ 25న సురేశ్ కృష్ణ ముంబై జన్మించారు. దర్శకత్వం, రచయితపై మక్కువతో ఆయన 1988లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అతి తక్కువ కాలంలోనే సురేష్ కృష్ణ భారతీయ చిత్ర దర్శకుడుగా పేరుగాంచారు. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో సినిమాలకు దర్శకత్వం వహించి ఎన్నో సూపర్ డూపర్‌ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నారు. 1988లో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సురేష్ కృష్ణ మొదట ‘సత్య’ అనే తమిళ సినిమాను తెరకెక్కించారు. సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో తీసిన ‘అన్నామలై’ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్టయ్యింది. ముఖ్యంగా సూపర్‌స్టార్ ప్రధాన పాత్రలో వచ్చిన ‘వీర’, ‘బాషా’, ‘బాబా’ వంటి సినిమాలకు సురేశ్ దర్శకత్వం వహించారు. సినిమాలతో పాటు పలు చానెల్స్‌లో ప్రసారమై వేలాదిమందిని ఆకట్టుకునే సీరియల్స్‌‌ను ఈయన తెరకెక్కించారు.

అందరూ టాపర్సే...

టాప్ హీరోలు.. మోహన్ లాల్, కమల్ హాసన్, సల్మాన్ ఖాన్, విష్ణువర్ధన్, మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, వెంకటేష్, మోహన్ బాబు, రెబల్ స్టార్ ప్రభాస్ వంటి ప్రముఖ హీరోల సినిమాలకు ఆయన దర్శకత్వం వహించి ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చారు. కాగా ఈయనకు ఇదివరకే ఉత్తమ దర్శకుడుగా 1989లో ‘ఇంద్రుడు చంద్రుడు’ అనే ప్రేమ సినిమాకు సురేశ్ నంది అవార్డు అందుకున్నారు.

More News

నేను ముఖ్యమంత్రి అయితే.... పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్‌కు తాను ముఖ్య‌మంత్రి అయితే ల‌క్ష ఉద్యోగాలు ఇచ్చే బాధ్య‌త తీసుకుంటాన‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ హామీ ఇచ్చారు.

ఇద్ద‌రు హీరోయిన్స్‌తో తలైవా

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ త‌దుప‌రి సినిమాకు రంగం సిద్ధ‌మ‌వుతోంది. ఎ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌జ‌నీకాంత్ చేయ‌బోయే సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.

లివ్ ఇన్ కోసం ప‌ర్మిష‌న్ కావాల‌ట‌...

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ స‌ర‌స‌న వ‌న్ నేనొక్క‌డినే చిత్రంలో న‌టించిన బాలీవుడ్ బ్యూటీ కృతిస‌న‌న్‌..

మ‌రో మెగా హీరోతో మైత్రీ

ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌గా పేరు సంపాదించుకున్న మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ యువ క‌థానాయ‌కుల‌తో వ‌రుస సినిమాలు చేస్తుంది.

 'ఇస్మార్ శంక‌ర్‌' హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా, డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం 'ఇస్మార్ట్ శంక‌ర్‌'. శ్రీమ‌తి లావ‌ణ్య స‌మ‌ర్ప‌ణ‌లో పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌