ఏపీలో థియేటర్లు నడపలేను: సురేష్ బాబు
Send us your feedback to audioarticles@vaarta.com
ఇటీవల కాలంలో చిత్ర పరిశ్రమలో సమస్యలు ఎక్కువవుతున్నాయి. కరోనా ప్రభావం బిజినెస్ ని పూర్తిగా దెబ్బతీస్తోంది. ముఖ్యంగా థియేటర్లు మూసేయాల్సిన పరిస్థితి వస్తోంది అంటూ ఎగ్జిబిటర్లు వాపోతున్నారు. టాలీవుడ్ లో దిల్ రాజు, సురేష్ బాబు లాంటి బడా నిర్మాతలు థియేటర్ బిజినెస్ లో కూడా ఇన్వాల్వ్ అయిన సంగతి తెలిసిందే.
నారప్ప రిలీజ్ సందర్భంగా సురేష్ బాబు ఏపీలో థియేటర్ల పరిస్థితి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఉన్న టికెట్ రేట్ల దృష్ట్యా ఏపీలో థియేటర్లు నడపడం కష్టం అని సురేష్ బాబు అన్నారు. నా వరకైతే నేను థియేటర్లు ఓపెన్ చేయను. 20, 30 రూపాయల టికెట్ ధరలతో ఏసీ థియేటర్లు నడపడం సాధ్యం అవుతుందా ? అని సురేష్ బాబు ప్రశ్నించారు.
ఈ విషయం గురించి ఇప్పటికే తాము ఏపీ ప్రభుత్వ మంత్రులతో మాట్లాడమని వారు కేబినెట్ లో పెడతామని చెప్పినట్లు సురేష్ బాబు అన్నారు. ఇక నారప్ప చిత్రాన్ని ఓటిటి లో రిలీజ్ చేయడం గురించి కూడా సురేష్ బాబు స్పందించారు.
నారప్ప చిత్రాన్ని ఓటిటిలో రిలీజ్ చేయవద్దు అంటూ తనపై చాలా ఒత్తిళ్లు వచ్చినట్లు సురేష్ బాబు తెలిపారు. కానీ థియేటర్స్ లో రిలీజ్ చేసిన రెండవ వారంలో థర్డ్ వేవ్ బలపడితే పరిస్థితి ఏంటి ? అని ఈ చిత్రాన్ని తనతో పాటు నిర్మించిన థాను గారు ప్రశ్నించినట్లు సురేష్ బాబు అన్నారు. ఈ పరిస్థితుల్లో నా కుటుంబాన్ని నేను బయటకు పంపను. అలాంటిది వేరే కుటుంబాలని థియేటర్స్ కి రమ్మనడం ఎంతవరకు సమంజసం అని థాను అన్నారు. ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకునే ఇష్టం లేకున్నా నారప్ప చిత్రాన్ని అమెజాన్ లో రిలీజ్ చేసినట్లు సురేష్ బాబు అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments