సురేష్ బాబు విడుదల చేసిన 'మెంటల్ మదిలో' ట్రైలర్
Send us your feedback to audioarticles@vaarta.com
"పెళ్ళిచూపులు" లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ను అందించిన నిర్మాత రాజ్ కందుకూరి నిర్మిస్తున్న తాజా చిత్రం "మెంటల్ మదిలో". శ్రీవిష్ణు కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకుడు. పలు షార్ట్ ఫిలిమ్స్ ద్వారా విశేషమైన క్రేజ్ సంపాదించుకొన్న వివేక్ ఆత్రేయ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన ఈ చిత్రం ట్రైలర్ ను నిన్న సాయంత్రం ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు లాంచ్ చేశారు.
ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ.. "ట్రైలర్ చాలా బాగుంది. ట్రైలర్ లో కథ గురించి చెప్పిన విషయాలు ఇంట్రస్టింగ్ గా ఉన్నాయి. "పెళ్ళిచూపులు" తరహాలోనే "మెంటల్ మదిలో" కూడా ఘన విజయం సాధించాలని కోరుకొంటున్నాను. వివేక్ ఆత్రేయ ఓ సరికొత్త ప్రయత్నంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు" అన్నారు.
నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. "సురేష్ బాబుగారు మా "మెంటల్ మదిలో" ట్రైలర్ ను విడుదల చేసి.. క్వాలీటీ అండ్ కంటెంట్ చూసి మమ్మల్ని అభినందించడం చాలా ఆనందంగా ఉంది. చాలా పాజిటివ్ బజ్ ఉన్న సినిమా ఇది. మా టీం అంతా కూడా సినిమా రిజల్ట్ పట్ల చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. త్వరలోనే ఆడియో విడుదల చేసి.. విడుదల తేదీని ప్రకటిస్తాం" అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments