సురేష్ బాబు ఆసక్తిగా ఉన్నాడు...
- IndiaGlitz, [Saturday,February 18 2017]
అక్కినేని మూడు తరాల హీరోలు కలిసి మనం వంటి మల్టీస్టారర్‌తో సక్సెస్ కొట్టారు. అక్కినేని ఫ్యామిలీ తర్వాత మూడు తరాల హీరోలు సినిమా రంగంకే అంకితమైన ఫ్యామిలీ దగ్గుబాటి రామానాయుడు ఫ్యామిలీ. తమ ఫ్యామిలీ అంతా కలసి ఓ మల్టీస్టారర్ మూవీ చేయాలనే కోరిక రామానాయుడుకు ఎక్కువగా ఉండేది. అయితే ఆయన ఆనారోగ్యంతో కన్నుమూశారు.
ఇప్పుడు నాన్నగారి కోరికను తాను తీరస్తానని అంటున్నాడు రామానాయుడు పెద్ద తనయుడు, నరి్మాత డి.సురేష్‌బాబు. తమ ఫ్యామిలీకి హీరో, వెంకటేష్, రామానాయుడు రెండవ తనయుడు వెంకటేష్, రామానాయుడు మనవళ్ళు రానా, చైతన్యతో ఓ మల్టీస్టారర్ తప్పక చేస్తానని తెలియజేశాడు. మరి ఈ మల్టీస్టారర్‌కు ఎప్పుడు రంగం సిద్ధమవుతుందో చూడాలి..