ఫైట్ మాస్టర్ నాగరాజు కుటుంబానికి 5లక్షల చెక్ అందజేత
Send us your feedback to audioarticles@vaarta.com
ఫైట్ మాస్టర్ నాగరాజు 'నేనే రాజు నేనే మంత్రి' షూటింగ్ సమయంలో అనారోగ్యం కారణంగా చనిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఆ చిత్ర యూనిట్ తో పాటు, సినీ పరిశ్రమకు చెందిన మరికొంత మంది సహకారంతో ఆర్ధిక సహాయం ప్రకటించింది.
దీనిలో భాగంగా హైదరాబాద్ రామానాయుడు స్టూడియో లో 'మా' అధ్యక్షులు శివాజీ రాజా ఆధ్వర్యంలో నిర్మాత సురేష్ బాబు చేతుల మీదుగా బాధిత కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్ ను అందించడం జరిగింది. నాగరాజు భార్య సంధ్య చెక్ ను అందుకున్నారు.
అనంతరం నాగరాజు-సంధ్య దంపతుల ముగ్గురు ఆడపిల్లలు బాగా చదువుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సురేష్ బాబు ఆకాంక్షించారు. అలాగే ఈ సహాయం పట్ల 'మా' అధ్యక్షులు శివాజీ రాజా హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఫైట్ మాస్టర్ యూనియన్ ప్రెసిడెంట్ సతీష్ తదితరులు పాల్గున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com