ఫైట్ మాస్ట‌ర్ నాగ‌రాజు కుటుంబానికి 5ల‌క్ష‌ల చెక్ అంద‌జేత‌

  • IndiaGlitz, [Saturday,November 11 2017]

ఫైట్ మాస్ట‌ర్ నాగ‌రాజు 'నేనే రాజు నేనే మంత్రి' షూటింగ్ స‌మ‌యంలో అనారోగ్యం కార‌ణంగా చ‌నిపోయిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఆ చిత్ర యూనిట్ తో పాటు, సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన మ‌రికొంత మంది స‌హ‌కారంతో ఆర్ధిక స‌హాయం ప్ర‌క‌టించింది.

దీనిలో భాగంగా హైద‌రాబాద్ రామానాయుడు స్టూడియో లో 'మా' అధ్య‌క్షులు శివాజీ రాజా ఆధ్వ‌ర్యంలో నిర్మాత సురేష్ బాబు చేతుల మీదుగా బాధిత కుటుంబానికి 5 ల‌క్ష‌ల రూపాయ‌ల చెక్ ను అందించడం జ‌రిగింది. నాగ‌రాజు భార్య సంధ్య చెక్ ను అందుకున్నారు.

అనంత‌రం నాగ‌రాజు-సంధ్య దంపతుల ముగ్గురు ఆడ‌పిల్ల‌లు బాగా చ‌దువుకుని ఉన్న‌త స్థానాల‌కు చేరుకోవాల‌ని సురేష్ బాబు ఆకాంక్షించారు. అలాగే ఈ స‌హాయం ప‌ట్ల 'మా' అధ్య‌క్షులు శివాజీ రాజా హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఫైట్ మాస్ట‌ర్ యూనియ‌న్ ప్రెసిడెంట్ స‌తీష్ త‌దిత‌రులు పాల్గున్నారు.