ఆ భయం వలన బాగున్నా సినిమాని కూడా తీయలేక పోతున్నాను - సురేష్ బాబు
Wednesday, December 21, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
నూతన నటీనటులు విశ్వదేవ్ రాచకొండ, పునర్నవి హీరో,హీరోయిన్లుగా రామ్మోహన్ నిర్మించిన చిత్రం పిట్టగోడ. ఈ చిత్రానికి నూతన దర్శకుడు అనుదీప్ కె.వి దర్శకత్వం వహించారు. సన్ సైన్ సినిమాస్ బ్యానర్ పై రూపొందిన ఈ చిత్రాన్నిడి.సురేష్ బాబు సమర్పణలో రామ్మోహన్ నిర్మించారు. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రూపొందిన పిట్టగోడ సినిమా ఈనెల 24న రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు డి.సురేష్ బాబుతో ఇంటర్ వ్యూ మీకోసం...!
కొత్త వాళ్లతో పిట్టగోడ సినిమా తీసారు. కొత్తవాళ్లతో అయితే ఈజీగా ఉంటుందని తీసారనుకోవచ్చా..?
కొత్త ఆర్టిస్టులు, కొత్త డైరెక్టర్ తో నిర్మించిన కొత్త సినిమా పిట్టగోడ. అందరూ కొత్తవాళ్లతో సినిమా తీయడం అంటే అంత ఈజీ కాదు. చాలా కష్టం. ఎవరైనా కొత్తవాళ్లతో సినిమా తీసి సక్సెస్ అయిన తర్వాత స్టార్ హీరోతో సినిమా తీయచ్చు అనుకుంటారు. నేను రామ్మోహన్ తో అదే చెప్పాను కావాలంటే వెంకీ, రానా లతో సినిమా తీయమని చెప్పాను. కానీ...రామ్మోహన్ కొత్తవాళ్లతో చేస్తాను అని పిట్టగోడ తీసాడు. రామ్మోహన్ కి సినిమా అంటే ఎంతో ఫేషన్. అందుకనే డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో సినిమాలు తీస్తున్నాడు.
ఇంతకీ...పిట్టగోడ కథ ఏమిటి..?
పిట్టగోడ సినిమా కథ గురించి చెప్పాలంటే...వెరీ నైస్ ఇన్నోసెంట్ ఫిల్మ్. పనిపాట లేకుండా ఖాళీగా తిరుగుతున్నారు అని అందరూ అంటుంటే మన పేరు న్యూస్ పేపర్ లో రావాలి. మనమేమిటో అందరికీ తెలియాలి అనుకునే డ్రీమ్ ఉన్న కుర్రాళ్ల కథ ఇది. ఆఖరికి వాళ్లు లైఫ్ లో ఎలా సక్సెస్ అయ్యారు అనేది పిట్టగోడ కథ.
పిట్టగోడ కథ విన్నప్పుడు మిమ్మల్ని ఆకట్టుకున్న పాయింట్ ఏమిటి..?
రెండు సంవత్సరాల క్రితం నాన్నకు ఆరోగ్యం బాగోకపోవడం వలన బెంగుళూరులో ఉన్నప్పుడు రామ్మోహన్ ఈ సినిమా గురించి చెప్పాడు. ఈ మూవీ డైరెక్టర్ అనుదీప్ వచ్చి కథ చెప్పాడు. అతను కథ చెబుతుంటే అది జోకో కాదో తెలియదు కానీ...నవ్వుతూ బాగా ఎంజాయ్ చేసాను. ఇందులో ఉన్న పాయింట్ గురించి చెప్పాలంటే....ఇప్పుడు నోట్ల రద్దు ఎంత హాట్ టాపిక్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో నోట్ల రద్దు అనే పాయింట్ ఉంది. ఇదేదో ఇప్పుడు కావాలని పెట్టింది కాదు. రెండు సంవత్సరాల క్రితం అనుకున్నపాయింట్. ఇప్పుడు నేను చెప్పడం కన్నా చూస్తే తెలుస్తుంది చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటుంది.
ఈ సినిమాలో కూడా నోట్ల రద్దు గురించి ఉంది అంటున్నారు కదా...! అసలు నోట్ల రద్దు ప్రభావం ఇండస్ట్రీ పై ఎలా ఉంది..? దీనిపై మీ అభిప్రాయం ఏమటి..?
నోట్ల రద్దు వలన సినిమా ఇండస్ట్రీ పై ప్రభావం ఉన్నమాట వాస్తవమే. మందు పై కూడా ఒకటి రెండు రోజులు ప్రభావం చూపించింది. ఆతర్వాత మామూలు అయ్యింది కదా..! అలాగే సినిమాలు చూడడానికి జనం రాక ఫస్ట్ కాస్త కష్టం అనిపించింది. ఆతర్వాత థియేటర్స్ కి జనం రావడం మొదలెట్టారు. మన అలవాట్లను మార్చుకోలేం. నోట్ల రద్దు పై నా అభిప్రాయం చెప్పాలంటే...కాస్త కష్టంగా ఉన్న నోట్ల రద్దు అనేది మంచిది అని నా అభిప్రాయం. దేశానికి మెడిసిన్ లాంటిది అని నా ఫీలింగ్..!
మీరు సమర్పకుడిగా వ్యవహరించిన పెళ్లిచూపులు విజయం సాధించిందని ఈ సినిమాకి కూడా సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారా..?
పెళ్లిచూపులు సినిమాకి నేను సమర్పకుడిగా వ్యవహరించాను కరెక్టే. అయితే...ఆ సినిమా కథ బాగుంది పెద్ద విజయం సాధించింది. అంతే కానీ..నేను సమర్పకుడిగా ఉన్నంత మాత్రాన సినిమా సక్సెస్ కాదు. సినిమా బాగుంటేనే చూస్తారు.
సురేష్ ప్రొడక్షన్స్ లో వరుసగా సినిమాలు తీసేవారు కదా...! ఈ మధ్య సినిమాలు నిర్మించడం కాస్త తగ్గించడానికి కారణం..?
దాదాపు 30 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. దీంతో సినిమాల గురించి బాగా తెలుసుకోవడం వలన ఏ కథ విన్నా ఎక్కడో విన్నట్టు అనిపించడం...లేదా ఏదో తప్పు కనిపించడం వలన సినిమా స్టార్ట్ చేయడానికి బాగా టైమ్ తీసుకుంటున్నాను. ప్రస్తుత పరిస్ధితుల్లో సినిమా తీస్తే ఎలా ఉంటుందో అనే భయం వలన కూడా బాగున్నా సినిమాని కూడా తీయలేకపోతున్నాను. చాలా సినిమాలు అలా అనుకుని మధ్యలో ఆపేసినవి ఉన్నాయి. అంతే కానీ..కావాలని సినిమాలు తగ్గించాలి అని ప్లాన్ చేసింది కాదు.
ప్రస్తుతం చిన్న సినిమాలకు ప్రేక్షకుల నుంచి ఆదరణ ఎలా ఉంది అనుకుంటున్నారు..?
చిన్న సినిమాలు చూడడానికి ఎవరూ థియేటర్స్ కి రారు. అందరూ స్టార్స్ సినిమా చూడడానికే ఇష్టపడతారు. హిట్ మూవీ అయినా, ఫ్లాప్ మూవీ అయినా స్టార్స్ ఉన్న సినిమా చూద్దాం అనుకుంటారు. ఇక్కడే కాదు అన్ని చోట్ల ఇదే పరిస్థితి. అయితే...చిన్న సినిమా బాగుంది అని టాక్ వస్తే అప్పుడు చూడడానికి థియేటర్స్ కి వస్తుంటారు.
సురేష్ ప్రొడక్షన్ లో నిర్మించిన చిత్రాలను మళ్లీ ఇప్పుడు తీయాలి అంటే ఏ సినిమా తీస్తారు..?
ప్రేమ్ నగర్ సినిమాని ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్టు తీయాలి అని ఉంది. ఆ సినిమా ఎలా ఉందో అలా కాకుండా అందులోని ప్రేమకథను తీసుకుని లేటెస్ట్ ట్రెండ్ కి అనుగుణంగా తీస్తే బాగుంటుంది అనిపిస్తుంది.
నాగ చైతన్యతో మీరు నిర్మించాలి అనుకున్న సినిమాని రానా ప్రొడ్యూస్ చేస్తున్నాడు కదా..!
అవును. ఈ సినిమాని నాగచైతన్య హీరోగా రానా నిర్మిస్తున్నాడు. నా గైడెన్స్ లోనే ఈ సినిమా నిర్మాణం జరుగుతుంది.
మీకు ఇన్ స్పిరేషన్ ఎవరు..?
నాన్నగారు, చక్రపాణి గారు, రాఘవేంద్రరావు గారు దగ్గర నుంచి పెళ్లి చూపులు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ వరకు నాకు తెలియని విషయం ఉంది అంటే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నేర్చుకుంటుంటాను.
సురేష్ ప్రొడక్షన్ లో మీరు నిర్మిస్తున్న సినిమాలు ఏమిటి..?
రవిబాబు దర్శకత్వంలో అదిగో అనే సినిమా నిర్మిస్తున్నాను. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం గ్రాఫిక్స్ వర్క్ జరుపుకుంటుంది. సమ్మర్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. రానా హీరోగా తేజ దర్శకత్వంలో ఓ సినిమా నిర్మిస్తున్నాను. ఇదొక కొత్తతరహా కథతో రూపొందుతుంది. ఇందులో యాక్షన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. చైతన్య హీరోగా రానా నిర్మించే సినిమా. ప్రస్తుతం ఈ మూడు చిత్రాలను నిర్మిస్తున్నాను. ఈ మూడు పూర్తైన తర్వాత వెంకటేష్ తో సినిమా ప్లాన్ చేస్తున్నాను.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments