నిర్మాతగా మారుతున్న మెగా డైరెక్టర్?
Send us your feedback to audioarticles@vaarta.com
రీసెంట్‌గా మెగాస్టార్ చిరంజీవితో `సైరా నరసింహారెడ్డి` సినిమాను డైరెక్ట్ చేసిన సురేందర్ రెడ్డి మెగా డైరెక్టర్‌గా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఎందుకంటే అంత పెద్ద మెగా ప్రాజెక్ట్‌ను సురేందర్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసేశాడు. ఇప్పుడు తదుపరి ప్రభాస్‌తో ఓ సినిమా చేస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో సురేందర్ రెడ్డి గురించి ఆసక్తికరమైన సమాచారం తెలిసింది. వివరాల ప్రకారం.. సురేందర్ రెడ్డి త్వరలోనే ఓ ప్రొడక్షన్ హౌస్‌ను స్టార్ట్ చేయబోతున్నాడట. త్వరలోనే ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌కు సంబంధించిన నిర్మాత రాజీవ్ రెడ్డితో కలిసి సురేందర్ నిర్మాణ సంస్థను స్టార్ట్ చేయబోతున్నాడట.
ప్రభాస్ సినిమా ఖరారైతే సురేందర్ రెడ్డి డైరెక్టర్‌గా ప్రభాస్‌తో సినిమా చేస్తూనే మరో పక్క సినిమా నిర్మాణంలో భాగమవుతాడట. ఒకవేళ ప్రభాస్ ప్రాజెక్ట్ ఫైనలైజ్ కాకుంటే మాత్రం ఆ సినిమాను వరుణ్ తేజ్‌తో చేయాలనుకుంటున్నాడట. ఒకవేళ వరుణ్ తేజ్‌తో చేస్తే మాత్రం డైరెక్టర్ చేస్తూ సినిమాను ప్రొడ్యూస్ చేస్తాడట. ఈ ఏడాది మాత్రం వరుణ్ తేజ్ ఖాళీగా లేడు. కాబట్టి ఈ ప్రాజెక్ట్ ఓకే అయినా నెక్ట్స్ ఇయర్‌లోనే ఓకే కావచ్చు. అయితే రీసెంట్‌గా దిల్‌రాజు సహకారంతో ప్రభాస్‌ణు కలిసి సురేందర్ రెడ్డి కథను వివరించాడట. ప్రభాస్‌కు కూడా కథ నచ్చింది. పూర్తి స్క్రిప్ట్‌ను సిద్ధం చేసి వినిపించమని చెప్పాడట. ఇప్పుడు సురేందర్ రెడ్డి స్క్రిప్ట్‌ను సిద్ధం చేసే పనిలో ఉన్నాడని టాక్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com