హిట్ సినిమా సీక్వెల్‌కు సురేందర్ రెడ్డి ప్లాన్!
Send us your feedback to audioarticles@vaarta.com
అవును మీరు వింటున్నది నిజమే.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సీక్వెల్ సినిమాకు రెడీగా ఉన్నాడట. అన్నీ అనుకున్నట్లు జరిగితే సుక్కుతో సినిమా అవ్వగానే లైన్‌లోకి తీసుకురావాలని సురేందర్ రెడ్డి భావిస్తున్నారట. ఇంతకీ ఆ సీక్వెల్ సినిమా ఏంటి..? బన్నీ నిజంగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడా..? కథ సిద్ధం చేసుకునే పనిలో డైరెక్టర్లు బిజిబిజీగా ఉన్నారా..? అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
గత ఏడాది మెగాస్టార్ చిరంజీవితో ‘సైరా నరసింహారెడ్డి’ వంటి హిస్టారికల్ సినిమా చేసిన దర్శకుడు సురేందర్ రెడ్డి బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు. అయితే ఈ సినిమా తర్వాత ఎవర్ని లైన్‌లో పెడతారా..? అని ఆయన అభిమానులు ఎంతగానో వేచి చూస్తున్నారు. వాస్తవానికి రెండు కథలు సిద్ధంగా ఉన్నాయట. అయితే ఒకటి మెగా హీరో వరుణ్ తేజ్‌కు.. మరొకటి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అట. అయితే వీరిద్దరూ బిజిబిజీగా ఉండటం.. పైగా వీళ్లను ఉద్దేశించి రాసిన కథలు.. వీరికి మాత్రమే సెట్ అవుతాయట. అందుకే ఆ ఇద్దరూ ప్రస్తుతం ఎవరి సినిమాల్లో వాళ్లు బిజీబిజీగా ఉన్నారు. దీంతో గట్టిగానే గ్యాప్ వస్తుంది మరీ ఏం చేద్దాం అని ఆలోచించిన సురేందర్ రెడ్డి.. అప్పుడెప్పుడో అనుకున్న ‘రేసుగుర్రం’ సీక్వెల్‌కు సన్నాహాలు చేస్తున్నారట.
సీక్వెల్ తీద్దామని బన్నీని సంప్రదించగా.. ఆయన కూడా హిట్ సినిమా కావడంతో ఏ మాత్రం ఆలోచించకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. వాస్తవానికి లాంగ్ గ్యాప్ తర్వాత ‘అల వైకుంఠపురములో..’ సినిమాతో బన్నీ లైన్‌లోకి వచ్చాడు. ప్రస్తుతం సుక్కుతో సినిమా చేస్తుండటంతో అనంతరం గ్యాప్ తీసుకోకుండా మరో కథకు రెడీ కావాలని అనుకున్నారట. సరిగ్గా ఈ టైమ్‌లోనే సురేందర్ సంప్రదించడంతో బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. అటు ‘అల’ సూపర్ హిట్‌తో ఊపు మీదున్న బన్నీ.. ఇటు ‘సైరా’ సక్సెస్‌తో క్రీజులో ఉన్న సురేందర్ సీక్వెల్ సినిమా ఏ మాత్రం వర్కవుట్ అవుతుందో.. అసలు ఈ సీక్వెల్ వ్యవహారంలో నిజానిజాలెంతో తెలియాలంటే అధికారికంగా ప్రకటన రావాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments