అఖిల్ తో సురేందర్ రెడ్డి సినిమా (ఎక్స్ క్లూజీవ్ డీటైల్స్)
Send us your feedback to audioarticles@vaarta.com
అక్కినేని అఖిల్ మనం ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్నిఅన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మిస్తున్నారు. ఈ నెల 12న పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించనున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే...ఈ మూవీ తర్వాత అఖిల్ స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ భారీ చిత్రం చేయనున్నారు.
ఈ విషయాన్ని స్వయంగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి చెప్పారు. 100% లవ్ తర్వాత చైతన్యతో సినిమా చేయాలి అనుకున్నారు కదా..! ఎప్పుడు ఉంటుంది అని అడిగితే...అవును...100% లవ్ తర్వాత చైతన్యతో సినిమా చేయాలి అనుకున్నాను. అప్పటి నుంచి చైతన్యతో టచ్ లోనే ఉన్నాను. ఖచ్చితంగా చైతన్యతో సినిమా చేస్తాను. అంతకంటే ముందు అఖిల్ తో సినిమా చేస్తున్నాను అని తెలియచేసారు. అయితే...ఏ బ్యానర్ లో ఈ మూవీ ఉంటుంది. ఎప్పుడు ఈ మూవీ ఉంటుంది అనేది తెలియాల్సి ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com