సురేందర్ రెడ్డి తొలి అడుగు
Send us your feedback to audioarticles@vaarta.com
గతేడాది 'రేసుగుర్రం'తో సూపర్‌హిట్‌ని.. ఈ ఏడాది 'కిక్ 2'తో సూపర్ ఫ్లాప్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు టాలెంటెడ్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి. ఈ నేపథ్యంలో సూరి నుంచి రానున్న తదుపరి చిత్రంపై ఇండస్ట్రీ వర్గాలు ప్రత్యేక ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయి. వినిపిస్తున్న కథనాల ప్రకారం.. రామ్‌చరణ్‌తో సురేందర్ రెడ్డి నెక్ట్స్ ప్రాజెక్ట్ ఉంటుందని పక్కాగా తెలియవస్తోంది.
తమిళంలో ఘన విజయం సాధించిన లేటెస్ట్ సెన్సేషన్ 'తని ఒరువన్'కి రీమేక్‌నే ఈ సినిమా అనేది ఫిల్మ్‌నగర్‌లో చక్కర్లు కొడుతున్న విషయం. అదే గనుక కార్యరూపం దాలిస్తే.. సురేందర్ రెడ్డి కి చరణ్‌తో తెరకెక్కించబోతున్న ఈ సినిమా వెరీ స్పెషల్ అవుతుంది. ఎందుకంటే.. ఇప్పటివరకు రీమేక్ చిత్రాల జోలికి వెళ్లకుండా తన శైలిలో తను సినిమాలు చేసుకుపోతున్న సురేందర్‌కి.. ఈ సినిమా రీమేక్ పరంగా తొలి అడుగు అవుతుంది. ఈ తొలి అడుగు విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే.. సురేందర్ రెడ్డి మళ్లీ ఇట్టే ఫామ్‌లోకి వచ్చేస్తాడన్నది టాలీవుడ్ వర్గాల వారి అభిప్రాయం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com