సినీ ఇండస్ట్రీకి గుడ్ బై.. యాంకరింగ్‌కు సై అంటున్న సురేఖా..!
Send us your feedback to audioarticles@vaarta.com
సుమ కనకాల, ఉదయభాను, ఝాన్సీ.. బుల్లితెరను ఏలుతున్న రారాణులు.! టీవీ షోలతో తెలుగింట ప్రతి ఒక్కరికీ పరిచయమైన ఈ యాంకర్ల జాబితాలోకి తాజాగా మరో పేరు చేరబోతుందా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. టాలీవుడ్‌లో అక్క, వదిన, తల్లి పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే సురేఖా వాణి త్వరలో బుల్లితెరపై ప్రత్యక్షం కానున్నారని సమాచారం. ఆమె సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పనున్నారని టాక్ నడుస్తోంది. భర్త చనిపోయిన బాధ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆమె.. కొన్ని సినిమాలకు కూడా సైన్ చేశారని తెలుస్తోంది.
సుప్రీత గురించే ఆలోచన..
ఆమె సినీ పరిశ్రమకు దూరమైతే వ్యాపారం మొదలుపెట్టే ఆలోచనల్లో ఉన్నారని సమాచారం. గ్లామరస్‌గా కనిపించే సురేఖ కెరీర్ మొదట్లో ‘మా’ టీవీలో యాంకర్‌గా చేసిన విషయం తెలిసిందే. తాజాగా.. ఓ టీవీ షో కోసం ఆమెను సంప్రదించినట్టు టాక్. అయితే తాను టీవీ షో చేయడానికి రెడీగా లేరని చెబుతున్నారు. తన కూతురు సుప్రీత గురించి ఆలోచిస్తున్నట్టు తెలిపారు. సుప్రీతను నటిగా చూడాలన్నది తన భర్త కల అని, ఆ కలను సాకారం చేయాలన్నది తన భావన అన్నారు. ఇప్పటికే పలు షార్ట్ ఫిల్మ్స్, టిక్‌టాక్‌లతో సుప్రీత యాక్టింగ్ స్కిల్స్ బయటపెట్టిందని, ఓ మంచి ఆఫర్ కోసం ఎదురు చూస్తున్నట్టు తెలిపారు.
సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా..
సురేఖ ప్రస్తుతం అటు తమిళం, ఇటు తెలుగు రెండు పరిశ్రమల్లోనూ సినిమాలు చేస్తున్నారు. సినిమాలకు కొదవ లేకపోయినా... ప్రస్తుతం లాక్‌డౌన్‌తో షూటింగ్‌లకు దూరమయ్యారు. అయినా టిక్‌టాక్ వీడియోలతో అభిమానులను ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు. సోషల్ మీడియాలో సందడి చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. తల్లికూతురు ఇద్దరూ పోటాపోటీగా వీడియోలు పోస్ట్ చేస్తూ హడావుడి చేస్తున్నారు. మరోవైపు హాట్ హాట్ ఫొటోలతోనూ నెట్టింట్లో హాట్ టాపిక్ అవుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments