జో పాత్ర మెప్పిస్తుందంటున్న సురభి
Send us your feedback to audioarticles@vaarta.com
ఉషాకిరణ్ మూవీస్ వారి బీరువా చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది ఢిల్లీ సుందరి సురభి. డీసెంట్ హిట్ అనిపించుకున్న ఆ సినిమా తరువాత.. ఎక్స్‌ప్రెస్ రాజా, ఎటాక్, జెంటిల్‌మన్ చిత్రాల్లో ఈ ముద్దుగుమ్మ కథానాయికగా నటించింది. వీటిలో ఎటాక్ చిత్రాన్ని మినహాయిస్తే.. మిగిలిన రెండు చిత్రాలు కూడా మంచి విజయమే సాధించాయి.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ రెండు తెలుగు చిత్రాలు చేస్తోంది. ఆ సినిమాలే ఒక్క క్షణం, ఓటర్. వీటిలో ఒక్క క్షణం ముందుగా తెరపైకి రానుంది. అల్లు శిరీష్ హీరోగా ఎక్కడికి పోతావ్ చిన్నవాడా ఫేమ్ వి.ఐ.ఆనంద్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో సురభి.. జో అనే పాత్రలో సందడి చేయనుంది. కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా.. నటనకు కూడా అవకాశమున్న పాత్ర ఇదని.. తన గత చిత్రాల్లాగే ఈ సినిమా కూడా కమర్షియల్ సక్సెస్ అవుతుందన్న నమ్మకం ఉందని ఈ అమ్మడు చెప్పుకొస్తోంది. డిసెంబర్ 28న విడుదల కానున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతమందించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com