Rahul Gandhi:పరువు నష్టం కేసు : రాహుల్‌కు మరో షాక్.. శిక్ష నిలుపుదల కుదరదన్న కోర్ట్, వాట్ నెక్ట్స్..?

  • IndiaGlitz, [Thursday,April 20 2023]

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కోర్టులో చుక్కెదురైంది. పరువు నష్టం కేసులో తనకు విధించిన శిక్షను నిలిపివేయాలంటూ రాహుల్ దాఖలు చేసిన పిటిషన్‌ను గుజరాత్‌లోని సూరత్ సెషన్స్ కోర్టు గురువారం తోసిపుచ్చింది. తనకు రెండేళ్లు జైలు శిక్ష విధించాల్సినంత కేసు కాదని.. ట్రయల్ కోర్టు ఈ కేసుపై పారదర్శకంగా విచారణ జరపలేదని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. శిక్షను నిలిపివేయని పక్షంలో తన ప్రతిష్టకు నష్టం కలుగుతుందని రాహుల్ గాంధీ ప్రస్తావించారు. దీనిపై గత గురువారం ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. ఈ రోజు తుది తీర్పును వెలువరించింది. అయితే రాహుల్ పిటిషన్‌ను సెషన్స్ కోర్ట్ తిరస్కరించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఈ తీర్పును సవాల్ చేస్తూ గుజరాత్ హైకోర్ట్ లేదా సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం వుంది.

అసలేంటీ వివాదం :

కాగా.. 2019 పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ కర్ణాటకలోని కోలార్‌లో ఓ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్ధిక నేరగాళ్లు లలిత్ మోడీ, నీరవ్ మోడీల పేర్లను ప్రస్తావించారు. ఈ క్రమంలోనే దొంగలందరికీ మోడీ అనే ఇంటిపేరే ఎందుకు వుంటోందోనంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను బీజేపీ నేతలు తప్పుబట్టారు. అంతేకాదు.. అప్పట్లోనే రాహుల్‌పై బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోడీ పరువు నష్టం దావా వేశారు. దీనిపై సూరత్‌లోని చీఫ్ జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ కోర్ట్ నాలుగేళ్లుగా విచారణ జరుపుతోంది. ఈ క్రమంలో గురువారం న్యాయమూర్తి తుది తీర్పు వెలువరించారు. ఈ సందర్భంగా మేజిస్ట్రేట్ కీలక వ్యాఖ్యలు చేశారు.

రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యుడిగా వున్నందున, ఆయన ప్రసంగాలకు ప్రభావం ఎక్కువన్నారు. తక్కువ శిక్ష వేస్తే దీని వల్ల భవిష్యత్తులో ఎవరిపైనైనా సులువుగా నిందలు వేస్తారని .. గతంలోనూ ఇలాగే వ్యవహరించి క్షమాపణలు సైతం చెప్పారని న్యాయమూర్తి గుర్తుచేశారు. అయినప్పటికీ రాహుల్ గాంధీ ప్రవర్తనలో మార్పు రాలేదని మేజిస్ట్రేట్ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. అయితే రాహుల్ గాంధీ అభ్యర్ధన మేరకు వ్యక్తిగత పూచీకత్తుపై ఆయనకు బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. అలాగే పైకోర్టులో అప్పీల్ చేసేందుకు వీలుగా నెల రోజుల సమయం ఇచ్చింది.

మరుసటి రోజే రాహుల్‌పై అనర్హత :

అయితే పరువు నష్టం కేసులో సూరత్ కోర్ట్ రాహుల్‌కు రెండేళ్ల జైలు శిక్స విధించిన మరుసటి రోజే ఆయనపై లోక్‌సభ అనర్హత వేటు వేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 102 (1) (ఇ)లోని నిబంధనల ప్రకారం.. రాహుల్ గాంధీ దోషిగా తేలిన తేదీ నుంచి పార్లమెంట్ సభ్యుడిగా అనర్హుడైనట్లు లోక్‌సభ సెక్రటేరియట్ ప్రకటించింది. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 8కి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు లోక్‌సభ తెలిపింది.

ప్రజాప్రాతినిథ్య చట్టం ఏం చెబుతోంది:

అయితే ఏదైనా కేసులో దోషిగా తేలి , జైలు శిక్ష పడిన ప్రజా ప్రతినిధులు చట్టసభల్లో సభ్యులుగా కొనసాగడానికి వీల్లేదు. దీనికి అనుగుణంగా లోక్‌సభ సచివాలయం రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసింది. అంతేకాదు.. జైలు శిక్షతో పాటు మరో ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు సైతం సదరు నాయకుడు అనర్హుడవుతాడు. అలాగే ప్రజాప్రతినిధులు దోషులుగా తేలిన వెంటనే సదరు ప్రజాప్రతినిధిని అనర్హులుగా పరిగణించాలని 2013లోనే సుప్రీంకోర్ట్ స్పష్టం చేసింది.

More News

Vande Bharat Express:ఘోరం : వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొన్న జింక .. అది మీదపడి మనిషి మృతి

దేశ ప్రజలకు సుఖవంతమైన, వేగవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు గాను రైల్వే శాఖ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

Double Decker:ఏళ్ల తర్వాత హైదరాబాద్ రోడ్లపైకి డబుల్ డెక్కర్ బస్సులు, ఏయే రూట్లలో అంటే..?

భాగ్యనగర వాసుల చిరకాల వాంఛ అయిన డబుల్ డెక్కర్ బస్సులు దశాబ్ధాల తర్వాత తిరిగి హైదరాబాద్ రోడ్లపై చక్కర్లు కొట్టాయి.

Prema Vimanam:ఫీల్ గుడ్ ఎంటర్టైనర్‌గా జీ5 & అభిషేక్ పిక్చర్స్ నిర్మించిన వెబ్ ఫిల్మ్ 'ప్రేమ విమానం' ఫస్ట్ లుక్ పోస్టర్

గూఢచారి, రావణాసుర వంటి అద్భుతమైన సినిమాలను నిర్మించిన అభిషేక్ పిక్చర్స్ ఇప్పుడు ఓ వెబ్ ఫిల్మ్‌ను నిర్మించింది.

CM Jagan:సెప్టెంబర్ నుంచి విశాఖలోనే కాపురం.. మూడు రాజధానులపై తేల్చేసిన జగన్

2019 ఎన్నికల్లో ఏపీలో అధికారంలోకి వచ్చిన జగన్ .. మూడు రాజధానుల వ్యవహారాన్ని తెరపైకి తెచ్చిన సంగతి తెలిసిందే.

HYD:ప్రపంచంలోని అత్యంత సంపన్న నగరాల్లో హైదరాబాద్.. ఎంతమంది మిలియనీర్లు వున్నారో తెలుసా..?

తెలుగువారి భాగ్యనగరం, హైటెక్ సిటీ హైదరాబాద్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచంలోని అత్యంత సంపన్న నగరాల్లో హైదరాబాద్ 65వ స్థానంలో నిలిచింది.