ఆదికి జోడీగా సురభి
Send us your feedback to audioarticles@vaarta.com
'బీరువా', 'ఎక్స్‌ప్రెస్ రాజా', 'జెంటిల్‌మన్' లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న హీరోయిన్ సురభి. ఆరంభం నుంచి మంచి కథలను ఎంపిక చేసుకుంటూ ముందుకెళ్తున్న ఈ ముద్దుగుమ్మ.. గత ఏడాది పార్లల్ లైఫ్ నేపథ్యంలో సాగే 'ఒక్క క్షణం' సినిమాలో నటించింది.
ప్రస్తుతం మంచు విష్ణు హీరోగా నటిస్తున్న 'ఓటర్' సినిమాలో విష్ణుకి జోడిగా కనిపించనుంది. పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో పౌర హక్కులతో పాటు.. ఓటుకున్న విలువను కూడా తెలియజేయనున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది.
ఇదిలా ఉంటే.. ఇప్పుడు మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది ఈ భామ. ఆ వివరాల్లోకి వెళితే.. ఆది హీరోగా శ్రీనివాస నాయుడు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ లవ్ స్టొరీలో సురభి నాయికగా నటిస్తోంది. తొలిసారి ఆదితో కలిసి నటిస్తున్న ఈ చిత్రం ఇటీవలే చిత్రీకరణను ప్రారంభించుకుంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి మరిన్ని అప్‌డేట్స్ వెల్లడి కానున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments