మే 8 న సాయి ధరమ్ తేజ్ - అనిల్ రావిపూడి ల సుప్రీమ్ సక్సెస్ మీట్
Send us your feedback to audioarticles@vaarta.com
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరో గా, బబ్లీ బ్యూటీ రాశీ ఖన్నా హీరోయిన్ గా, 'పటాస్' సినిమా తో సూపర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వం లో రూపొందిన చిత్రం 'సుప్రీమ్'. మే 5న ప్రపంచ వ్యాప్తం గా విడుదలై, సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో నే హైయెస్ట్ కలెక్షన్స్ సాధిస్తోంది ఈ చిత్రం. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణ లో , శిరీష్ నిర్మిస్తోన్న ఈ చిత్రం ప్రేక్షకాదరణ పొందటం తో యూనిట్ అంతా సంతోషం గా ఉంది.
ఈ చిత్రం సక్సెస్ మీట్ ను మే 8 న అన్నపూర్ణ సెవెన్ ఏక్ర్స్ లో గ్రాండ్ గా సెలెబ్రేట్ చేయటానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. చిత్రం క్లైమాక్స్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోన్న వికలాంగుల ఫైట్ లో వర్క్ చేసిన వారిని ప్రత్యేకం గా సన్మానించాలని కూడా చిత్ర బృందం భావిస్తోంది. సుప్రీమ్ టీం మొత్తం ఈ ఫంక్షన్ కు అటెండ్ అవుతుంది అని చిత్ర బృందం చెబుతోంది.
"సుప్రీమ్ ఈ వేసవి సెలవుల్లో ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తోంది. కామెడీ సీన్స్ కి, సాంగ్స్ కి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో నే హైయెస్ట్ ఓపెనింగ్స్ ఉన్న చిత్రం సుప్రీమ్. . పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చిత్రాల తరువాత శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ తో సాయి ధరమ్ తేజ్ హాట్రిక్ హిట్ కొట్టిన చిత్రం ఇది", అని దిల్ రాజు అన్నారు.
దర్శకులు అనిల్ రావిపూడి మాట్లాడుతూ, "అన్ని ఏరియా ల లో మంచి కలెక్షన్స్ తో చిత్రం ఆదరణ పొందుతోంది. సాయి ధరమ్ తేజ్ పెర్ఫార్మన్స్, రాశి ఖన్నా గ్లామర్, మంచి ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రానికి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్", అన్నారు.
సాయి ధరమ్ తేజ్ , రాశీ ఖన్నా, రాజేంద్ర ప్రసాద్, రవి కిషన్, సాయి కుమార్, పోసాని కృష్ణ మురళి , శ్రీనివాస్ రెడ్డి, మురళీ మోహన్ , రఘు బాబు, జయప్రకాశ్ రెడ్డి, వెన్నెల కిషోర్ తదితరులు ఈ చిత్రం లో ప్రధాన పాత్రలు పోషించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com