అభిమానులకు సుప్రీమ్ పాటను చూపించిన సాయి ధరమ్ తేజ్ - దిల్ రాజు
Send us your feedback to audioarticles@vaarta.com
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరో గా, బబ్లీ బ్యూటీ రాశీ ఖన్నా హీరోయిన్ గా, 'పటాస్' సినిమా తో సూపర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వం లో రూపిందిన చిత్రం 'సుప్రీమ్'. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణ లో , శిరీష్ నిర్మిస్తోన్న ఈ చిత్రం మే 5 న భారీ విడుదలకు సిద్ధపడుతోంది.
జంగారెడ్డి గూడెం లో ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని, ఆ తరువాత రాజేశ్వరి ధియేటర్ లో ఫాన్స్ ను కలుసుకున్న సుప్రీమ్ యూనిట్, అక్కడ స్పెషల్ గా 'టాక్సీ వాలా' పాటను ప్రదర్శించారు. తమ కోసం ప్రత్యేకం గా రిలీజ్ కి ముందే ఇలా పాటను ప్రదర్శించటం తో, ఫాన్స్ ఎంతో ఆనందం తో యూనిట్ కు బ్రహ్మరధం పట్టారు. సాయి ధరమ్ తేజ్ వేసిన స్టెప్స్ చూసి బాగా ఎంజాయ్ చేసారు.
సుప్రీమ్ మే 5 న భారీ విడుదలకు సిద్ధం అవుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం పై ప్రేక్షకులలో భారీ అంచనాలే ఉన్నాయి. పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చిత్రాల తరువాత శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ తో సాయి ధరమ్ తేజ్ చేస్తోన్న మూడవ చిత్రం ఇది.
"సుప్రీమ్ అందరినీ అలరించే ఒక మాస్ ఎంటర్టైనర్.వేసవి సెలవుల్లో కుటుంబ సమేతం గా చూసి ఎంజాయ్ చేసే చిత్రం. మే 5 న భారీ విడుదల చేస్తున్నాం. ఇటీవలే విడుదల చేసిన ఆడియో కు మంచి స్పందన వస్తోంది . సాయి కార్తీక్ అందించిన పాటలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి ", అని శిరీష్ అన్నారు.
దర్శకులు అనిల్ రావిపూడి మాట్లాడుతూ, "మంచి ఎంటర్టైన్మెంట్ ఉన్న ఒక మాస్ చిత్రం ఇది. ఏక్షన్ , కామెడీ ,రొమాన్స్, ఫ్యామిలీ సెంటిమెంట్ సమపాళ్ళలో ఉండే చిత్రం ఇది. సాయి ధరమ్ తేజ్ డాన్స్ అండ్ పెర్ఫార్మన్స్ ఆకట్టుకుంటుంది", అన్నారు.
సాయి ధరమ్ తేజ్ , రాశీ ఖన్నా, రాజేంద్ర ప్రసాద్, రవి కిషన్, సాయి కుమార్, పోసాని కృష్ణ మురళి , శ్రీనివాస్ రెడ్డి, మురళీ మోహన్ , రఘు బాబు, జయప్రకాశ్ రెడ్డి, వెన్నెల కిషోర్ తదితరులు ఈ చిత్రం లో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments