సుప్రీమ్ ...ఫుల్ లెంగ్త్ కమర్షియల్ ఎంటర్ టైనర్
Send us your feedback to audioarticles@vaarta.com
రాముడి లక్ష్యం గొప్పదా? హనుమంతుని ఆశయం గొప్పదా? అని ఆలోచిస్తే రాముని లక్ష్యమే గొప్పదనుకునే ఓ యువకుడు ఆ లక్ష్యాన్ని మోసే రాముడు కోసం ఏం చేశాడనేదే సుప్రీమ్ సినిమా. వరుస విజయాల మీదున్న మెగా క్యాంప్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా, పటాస్ తో తొలి కమర్షియల్ సక్సెస్ సాధించిన అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సినిమా అనగానే ప్రేక్షకుల్లో సినిమా ఎలా ఉంటుందోనని అంచనాలు ఏర్పడ్డాయి. అనిల్ ద్వితీయ విఘ్నాన్ని దాటి సక్సెస్ సాధించాడా? సాయిధరమ్ మరో కమర్షియల్ హిట్ సాధించాడా అని తెలుసుకోవాలంటే సినిమా కథ తెలుసుకోవాల్సిందే
కథ
బాలు(సాయిధరమ్ తేజ్) ఓ ట్యాక్సీ డ్రైవర్, తను డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎవరైనా హారన్ కొట్టి డిస్ట్రబ్ చేస్తే వాళ్లకి నరకం చూపించే రకం బాలు. ఒకానొక సందర్భంలో ఆ ఏరియా ఎస్.ఐ బెల్లం శ్రీదేవి(రాశిఖన్నా)ని చూసి ప్రేమలో పడతాడు. ఆమెను, వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ ను ఒప్పించే సందర్భంలో ఓ సారి బాలుకు ఓ ఆంగ్లో ఇండియన్ కుర్రాడు కనపడతాడు. ఆ కుర్రాడుతో బాలుకు, అతని తండ్రి(రాజేంద్రప్రసాద్)కు మధ్య మంచి అనుబంధం ఏర్పడుతుంది. అయితే అనుకోకుండా బీకు(రవికిషన్)అనే గూండా ఆ కుర్రాడి కిడ్నాప్ చేస్తాడు. అసలు ఆ కుర్రాడెవరు? బీకు ఎందుకు కిడ్నాప్ చేస్తాడు? జాగృతి ట్రస్ట్ కు కుర్రాడి మధ్య రిలేషన్ ఏంటి? విక్రమ్ సర్కార్ ఎవరు? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...
సమీక్ష
సాయిధరమ్ తేజ్ తన ఎనర్జిటిక్ ఫెర్ ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. సినిమా అంతటినీ తానై ముందుకు తీసుకెళ్లాడు. డ్యాన్సులు, ఫైట్స్ బాగా చేశాడు. రాశిఖన్నా బెల్లం శ్రీదేవి పాత్రలో బాగా నటించింది. ప్రేక్షకులకు వినోదాన్ని పంచడంతో బెల్లం శ్రీదేవిగా రాశిఖన్నా సక్సెస్ అయ్యింది. ఆంగ్లో ఇండియన్ కుర్రాడు చాలా చక్కగా నటించాడు. జిల్ తర్వాత కబీర్ సింగ్ మరోసారి స్టైలిష్, కార్పొరేట్ విలన్ గా నటించాడు. తన పాత్ర మేర విలనిజాన్ని చక్కగా చేశాడు. సాయిధరమ్ తండ్రి పాత్రలో రాజేంద్రప్రసాద్, ట్రస్టీ నారాయణరావుగా సాయికుమార్ సీరియస్ గా బావున్నాయి. రఘుబాబు, పోసాని కృష్ణమురళి, శ్రీనివాస్ రెడ్డి, తనికెళ్ళభరణి, పృథ్వీ, ప్రభాస్ శ్రీను, వెన్నెలకిషోర్ తదితరులు వారి పాత్రల మేర తమ కామెడితో చక్కగా నవ్వించారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి తనదైన స్టైల్ లో సినిమాను కమర్షియల్ ఫార్మేట్ లో తెరకెక్కించాడు. ఫస్టాప్ మొత్తాన్ని కామెడి ట్రాక్ తోనే నడిపించిన అనిల్ రావిపూడి సెకండ్ హాఫ్ ను కాస్తా సీరియస్ మోడ్ లో నడిపించాడు. సాయికార్తీక్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బావుంది. చిరంజీవి అందం హిందోళం సాంగ్ ను సాయికార్తిక్ చక్కగా రీమిక్స్ చేశాడు. సాయిశ్రీరాం సినిమాటోగ్రఫీ బావుంది. ఎం.ఆర్.వర్మ ఎడిటింగ్ బావుంది. నిర్మాణ విలువలు బావున్నాయి.
విశ్లేషణ
సాయిధరమ్ యాక్టింగ్ పరంగా ఇంకా మెరుగయ్యాడు. జేబు దొంగలో చిరంజీవి స్టీల్ ప్లాంట్ బాబాయ్ రోల్ ను ఇమిటేట్ చేసినప్పుడు, రాశిఖన్నాను కామెడిగా బ్లాక్ మెయిల్ చేసేటప్పుడు కామెడి టైమింగ్ బావుంది. కూతురిని అడ్డదారుల్లో ఎస్.ఐ చేసిన తండ్రిగా రఘుబాబు, కృష్ణంరాజుని అనుకరించే విధానం ప్రేక్షకులను నవ్విస్తుంది. అలాగే రఘుబాబు, తనికెళ్ల భరణి మధ్య వచ్చే బెల్లం పాయసం కామెడి ట్రాక్ ప్రేక్షకులకు నవ్విస్తుంది. అలాగే పృథ్వీ, ప్రభాస్ శ్రీను హైటెక్ కార్ల దొంగలుగా అమేజింగ్...జింగ్ జింగ్ ...చేసిన నటన కూడా బావుంది. అలాగే పోసాని, శ్రీనివాస్ రెడ్డి సన్నాయి విద్వాంసులుగా తమదైన కామెడితో నవ్వించారు. సెకండాఫ్ అంతా వీరి కామెడితో నవ్వించే ప్రయత్నం చేశారు. అలాగే క్లయిమాక్స్ లో దివ్యాంగాల వ్యాయామశాల ఫైట్ ఆడియెన్స్ అలరిస్తుంది. సుప్రీమ్ హీరో రీమిక్స్ సాంగ్ పిక్చరైజేషన్ బావుంది. చిరంజీవి అభిమానులు హ్యపీగా ఫీలవుతారు. పటాస్ తర్వాత అనిల్ రావిపూడి చేసిన సుప్రీమ్ చిత్రాన్ని కమర్షియల్ వాల్యూస్ యాడ్ చేసి ప్రేక్షకుడికి సక్సెస్ ఫుల్ కమర్షియల్ ఎంటర్ టైనర్ ను అందిచండంలో సక్సెస్ అయ్యాడు. అనిల్ కు సాయికార్తీక్ మ్యూజిక్, సాయిశ్రీరాం సినిమాటోగ్రఫీ అదనపు బలాలుగా చేరడంతో సినిమా పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఆడియెన్స్ ను అలరిస్తుంది
బోటమ్ లైన్
సుప్రీమ్ ...ఫుల్ లెంగ్త్ కమర్షియల్ ఎంటర్ టైనర్
రేటింగ్ -3.25 /5
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout