'సుప్రీమ్ ' ఫస్ట్ షెడ్యూల్ పూర్తి
Send us your feedback to audioarticles@vaarta.com
పిల్లా నువ్వులేని జీవితం`, సుబ్రమణ్యం ఫర్ సేల్` చిత్రాల తర్వాత సుప్రీంహీరో సాయిధరమ్‌తేజ్ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రారంభమైన సుప్రీమ్` చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలోనే ఉంది. రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది. పటాస్` ఫేమ్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సాయిధరమ్ క్యాబ్ డ్రైవర్ గా కనిపిస్తాడు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. రెండవ షెడ్యూల్ ను త్వరలోనే ప్రారంభిస్తారట. సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఏప్రిల్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తునారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments