సుశాంత్ కేసులో సుప్రీం కీలక తీర్పు..
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో బుధవారం సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఇప్పటి వరకూ సేకరించిన ఆధారాలన్నీ సీబీఐకి అప్పగించాలని.. మహారాష్ట్ర పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ కేసును ఇప్పటికే బీహార్ సీఎం వినతి మేరకు కేంద్రం సీబీఐకి అప్పగించింది. తాజాగా సుప్రీంకోర్టు కూడా అవే ఆదేశాలను జారీ చేసింది. అలాగే సీబీఐ విచారణకు సహకరించాలని సుప్రీంకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. అవసరమైతే కొత్తగా కేసు ఫైల్ చేసేందుకు సైతం సుప్రీం సీబీఐకి అనుమతి ఇచ్చింది.
సుప్రీంకోర్టులో బాలీవుడ్ నటుడు సుశాంత్ స్నేహితురాలు రియా చక్రవర్తికి ఎదురుదెబ్బ తగిలింది. సుశాంత్ మృతి కేసులో సీబీఐ దర్యాప్తుకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తు వివరాలను సీబీఐకి అప్పగించాలని ముంబై పోలీసులను ఆదేశించింది. సీబీఐకి సహకరించాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. బీహార్ సీఎం వినతి మేరకు కేసును ఇప్పటికే సీబీఐకి కేంద్రం అప్పగించింది. అవసరమనుకుంటే కొత్తగా కేసు ఫైల్ చేసేందుకు సీబీఐకి అనుమతి ఇచ్చింది. సుశాంత్ మృతిపై అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
సుశాంత్ మృతిపై ఆది నుంచి తీవ్ర స్థాయిలో అనుమానాలు వ్యక్తమయ్యాయి. అది ముమ్మాటికీ హత్యేనని ఎక్కువ శాతం ప్రజలు నమ్మారు. సోషల్ మీడియా వేదికగా దీనిపై పెద్ద చర్చే నడిచింది. ఈ నేపథ్యంలో సుశాంత్ మృతిపై అనుమానాలున్నాయని.. దీనిపై సీబీఐ దర్యాప్తు కోరుతూ సుశాంత్ తండ్రి బీహార్ ప్రభుత్వాన్ని కోరారు. వెంటనే స్పందించిన బీహార్ ప్రభుత్వం సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించాలని కేంద్రాన్ని కోరింది. నేడు సుప్రీంకోర్టు కూడా సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout