Bilkis Bano Case: గుజరాత్ సర్కార్‌కు షాక్.. బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు
Send us your feedback to audioarticles@vaarta.com
బిల్కిస్ బానో(Bilkis Bano) కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. గుజరాత్ ప్రభుత్వం ఉత్తర్వులను కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో 11 మంది నిందితులకు తిరిగి జైలు శిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో నిందితులను విడుదల చేస్తూ గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బాధితురాలు బిల్కిస్ బానో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ బీవీ నాగరత్నం, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం తీర్పును వెల్లడించింది. దోషుల ముందస్తు విడుదలపై ఉత్తర్వులను జారీచేసే అర్హత మహారాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని గుజరాత్ ప్రభుత్వానికి ఉండదని పేర్కొంది. విడుదలైన 11 మంది నిందితతులు రెండు వారాల్లోగా జైలు అధికారుల ఎదుట లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది.
అసలు ఏం జరిగిందంటే..?
\కాగా 2002లో గుజరాత్లో జరిగిన చెలరేగిన అల్లర్ల సమయంలో అహ్మదాబాద్ సమీపంలోని రంధిక్ పూర్ గ్రామంలో బిల్కిన్ బానో కుటుంబంపై దుండుగులు దాడి చేసి ఏడుగురిని హత్య చేశారు. ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న 21 సంవత్సరాల బిల్కిన్ బానోపై ఐదు నెలల గర్భిణీ అని కూడా చూడకుండా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో 2008 జనవరి 21న 11 మంది నిందితులకు సీబీఐ ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు విధించింది. దీనిని బాంబే హైకోర్టు కూడా సమర్ధించింది.
2022లో నిందితులు విడుదల..
అయితే కొంతకాలం తర్వాత ఓ నిందితుడు తనను విడుదల చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం అతడి విజ్ఞప్తిని పరిశీలించి చర్యలు తీసుకోవాలని గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై ఆ రాష్ట్ర ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కేసులో నిందితులందరికీ రెమిషన్(జైలు శిక్ష తగ్గింపు) మంజూరు చేయాలని కమిటీ సభ్యులు సిఫారస్సు చేశారు. దీంతో 2022 ఆగస్టు 15న గుజరాత్ ప్రభుత్వం నిందితులందరినీ జైలు నుంచి విడుదల చేసింది. ప్రభుత్వం నిర్ణయంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయితే గుజరాత్ ప్రభుత్వం నిర్ణయాన్ని బిల్కిస్ బానో సుప్రీంకోర్టులు సవాల్ చేసింది. తాజాగా ఆమెకు మద్దతుగా తీర్పు వచ్చింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments