Bilkis Bano Case: గుజరాత్ సర్కార్‌కు షాక్.. బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు

  • IndiaGlitz, [Monday,January 08 2024]

బిల్కిస్ బానో(Bilkis Bano) కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. గుజరాత్ ప్రభుత్వం ఉత్తర్వులను కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో 11 మంది నిందితులకు తిరిగి జైలు శిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో నిందితులను విడుదల చేస్తూ గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బాధితురాలు బిల్కిస్ బానో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ బీవీ నాగరత్నం, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం తీర్పును వెల్లడించింది. దోషుల ముందస్తు విడుదలపై ఉత్తర్వులను జారీచేసే అర్హత మహారాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని గుజరాత్ ప్రభుత్వానికి ఉండదని పేర్కొంది. విడుదలైన 11 మంది నిందితతులు రెండు వారాల్లోగా జైలు అధికారుల ఎదుట లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది.

అసలు ఏం జరిగిందంటే..?

\కాగా 2002లో గుజరాత్‌లో జరిగిన చెలరేగిన అల్లర్ల సమయంలో అహ్మదాబాద్ సమీపంలోని రంధిక్ పూర్ గ్రామంలో బిల్కిన్ బానో కుటుంబంపై దుండుగులు దాడి చేసి ఏడుగురిని హత్య చేశారు. ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న 21 సంవత్సరాల బిల్కిన్ బానోపై ఐదు నెలల గర్భిణీ అని కూడా చూడకుండా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో 2008 జనవరి 21న 11 మంది నిందితులకు సీబీఐ ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు విధించింది. దీనిని బాంబే హైకోర్టు కూడా సమర్ధించింది.

2022లో నిందితులు విడుదల..

అయితే కొంతకాలం తర్వాత ఓ నిందితుడు తనను విడుదల చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం అతడి విజ్ఞప్తిని పరిశీలించి చర్యలు తీసుకోవాలని గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై ఆ రాష్ట్ర ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కేసులో నిందితులందరికీ రెమిషన్(జైలు శిక్ష తగ్గింపు) మంజూరు చేయాలని కమిటీ సభ్యులు సిఫారస్సు చేశారు. దీంతో 2022 ఆగస్టు 15న గుజరాత్ ప్రభుత్వం నిందితులందరినీ జైలు నుంచి విడుదల చేసింది. ప్రభుత్వం నిర్ణయంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయితే గుజరాత్ ప్రభుత్వం నిర్ణయాన్ని బిల్కిస్ బానో సుప్రీంకోర్టులు సవాల్ చేసింది. తాజాగా ఆమెకు మద్దతుగా తీర్పు వచ్చింది.

More News

బ్రేకింగ్: కార్పొరేటర్ పదవికి కేశినేని నాని కుమార్తె శ్వేత రాజీనామా

విజయవాడ రాజకీయాలు రోజురోజుకు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. ఇప్పటికే బెజవాడ ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని కేశినేని నాని(Kesinenei Nani) ప్రకటించిన సంగతి తెలిసిందే.

Guntur Karaam: యూట్యూబ్ ను షేక్ చేస్తోన్న 'గుంటూరు కారం' ట్రైలర్.. ప్రీరిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే..?

సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన 'గుంటూరు కారం'(Guntur Kaaram)చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్ యూట్యూబ్‌లో

Education in AP: సీఎం వైయస్ జగన్ సంస్కరణల ఫలితం.. దేశంలోనే ఏపీ ఫస్ట్..

ఏ రాష్ట్రంలోనైనా పేదరికం పోవాలంటే నాణ్యమైన విద్య ద్వారానే సాధ్యమవుతోంది. విద్యారంగం బాగుంటే ఆ రాష్ట్ర భవిష్యత్ కూడా కళకళలాడుతుంది.

Jr NTR Fans: జూ.ఎన్టీఆర్ అభిమానులపై లోకేష్ సైన్యం దాడి.. సర్వత్రా ఆగ్రహావేశాలు..

టీడీపీ అధినేత చంద్రబాబు తిరువూరులో నిర్వహించిన రా.. కదలిరా సభా ప్రాంగణంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు తీవ్ర అవమానం జరిగింది. తారక్ ఫొటోతో ఉన్న జెండాలను ఆయన అభిమానులు ప్రదర్శించారు.

PM Modi:అంతరిక్షంలో ఆదిత్య ఎల్-1' ప్రయోగం సక్సెస్.. ప్ర‌ధాని మోదీ హర్షం..

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో(ISRO)మరో ఘనత తన ఖాతాలో వేసుకుంది. సూర్యుడి రహస్యానాలను అధ్యయనం చేసేందుకు నింగిలోకి పంపి ఆదిత్య ఎల్‌-1(Aidtya L1)