‘మహా’ వ్యవహారంపై సుప్రీం సంచలన తీర్పు.. ఎవరి ధీమా వారిదే!
Send us your feedback to audioarticles@vaarta.com
మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ పరిణామాలు, సీఎంగా ఫడ్నవిస్ ప్రమాణంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. రేపు అనగా.. నవంబర్ 27న మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష బలాన్ని నిరూపించుకోవాలని సుప్రీం కోర్టు తీర్పును వెలువరించింది. అంతేకాదు.. . సీక్రెట్ బ్యాలెట్ కుదరదని బలపరీక్షను ప్రత్యక్షంగా ప్రసారం చేయాలని కోర్టు స్పష్టం చేసింది. కాగా ఈ బలపరీక్ష బుధవారం సాయంత్రం 5 గంటల లోపు పూర్తి కావాలని కోర్టు చెప్పింది. బలపరీక్షకు ముందే ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం జరగాలని.. అంతకంటే ముందుగా ప్రొటెం స్పీకర్‌ను నియమించాలని కోర్టు తేల్చిచెప్పింది. అయితే బీజేపీ మాత్రం బలపరీక్షకు 15రోజులు గడువు కోరగా.. ఆ వినతిని సుప్రీం తిరస్కరించింది.
ఇదీ పార్టీల పరిస్థితి..!
ఇదిలా ఉంటే.. సుప్రీం తీర్పుపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ రియాక్ట్ అయ్యారు. సుప్రీం చారిత్రాత్మక తీర్పును వెల్లడించిందని.. బలపరీక్షలో ఫడ్నవిస్ సర్కార్ కుప్పకూలడం ఖాయమని సోనియా చెప్పుకొచ్చారు. తప్పకుండా బలపరీక్షలో నెగ్గుతామని ఫడ్నవిస్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్సీపీ ఎమ్మెల్యేల మద్దతు తమకే ఉందని బీజేపీ ధీమాలో ఉంది. మరోవైపు మహారాష్ట్రలో తమ ప్రభుత్వమే ఏర్పడుతుందని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ చెప్పుకొచ్చారు. అంతేకాదు.. అజిత్ పవార్‌తో వెళ్లిన ఎమ్మెల్యేలందరూ తిరిగొచ్చారని పవార్ చెబుతున్నారు. కాగా.. మహారాష్ట్రలో పార్టీల బలాబలగాల విషయానికొస్తే.. బీజేపీ-105, శివసేన-54, ఎన్సీపీ-56, కాంగ్రెస్-44, ఇతరులు- 29మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్-145. అయితే రేపు అనగా బుధవారం ఏం జరగనుంది..? ప్రభుత్వం ఉంటుందా..? ఊడుతుందా..? అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout