రాజ్ భవన్ మెజార్టీ నిర్ణయించలేదు... ఫడ్నవీస్ అసెంబ్లీలో బలపరీక్ష నిరూపించుకోవాల్సిందే : సుప్రీం
- IndiaGlitz, [Monday,November 25 2019]
మహారాష్ట్ర సంక్షోభం పై సుప్రీం కోర్టులో వాదనలు ముగిశాయి. బలపరీక్షపై వాదనలు విన్న కోర్టు ... మంగళవారం ఉ.10.30 గంటలకు తీర్పును వెలువరించనుంది. తక్షణమే బలపరీక్ష జరపాలని ఎన్సీపీ తరపు న్యాయవాది సింఘ్వీ కోరగా... ఇందుకోసం గవర్నర్ 14 రోజుల సమయం ఇచ్చారని సొలిసిటర్ జనరల్ తెలిపారు. కాగా ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పును రిజర్వ్ లో ఉంచింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది అత్యున్నత న్యాయస్థానం.
రాజ్ భవన్ మెజార్టీ నిర్ణయించ లేదని... అసెంబ్లీలో మాత్రమే మెజార్టీ నిరూపిస్తుందని వ్యాఖ్యానించింది సుప్రీం. అసెంబ్లీలోనే ఫడ్నవీస్ తన బలాన్ని నిరూపించుకోవాల్పి ఉంటుందని తెలిపింది. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన ఫడ్నవీస్ కు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సంఖ్యాబలం ఉందా అని ప్రశ్నించింది. మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం, ఫిరాయింపులను అడ్డుకోవాలంటే తక్షణమే బలపరీక్ష జరపాల్సిన అవసరముందని పేర్కొంది సుప్రీం కోర్టు.