అనంత పద్మనాభుని ఆలయ బాధ్యత వారిదే.. వివాదానికి చెక్ పెట్టిన సుప్రీం

  • IndiaGlitz, [Monday,July 13 2020]

కేరళలోనే ప్రఖ్యాతి చెందిన అనంత పద్మనాభ స్వామి ఆలయ వివాదానికి సంబంధించిన తుది తీర్పును నేడు సుప్రీంకోర్టు వెలువరించింది. ఆలయ నిర్వహణ బాధ్యతను ట్రావెన్‌కోర్ రాజవంశానిదేనని తేల్చి చెప్పింది. ప్రస్తుతం అనంత పద్మనాభుని ఆలయంపై ట్రావెన్‌కోర్ రాజకుటుంబానికున్న హక్కులను సమర్థించడమే కాకుండా తదుపరి నిర్వహణ భాధ్యతలను కూడా వారికే అప్పగించింది. దీంతో తొమ్మిదేళ్లుగా కొనసాగుతున్న వివాదానికి నేటితో సుప్రీంకోర్టు చెక్ పెట్టింది.

అనంత పద్మనాభ స్మామివారి దేవాలయం నేలమాళిగల్లో భారీ నిధి నిక్షేపాలు బయటపడటంతో ఒక్కసారిగా వార్తల్లోకెక్కింది. ఈ నిధులన్నింటినీ ట్రావెన్ కోర్ రాజవంశీయులే కాపాడుకుంటూ వస్తున్నారు. కాగా... దీనిపై ఆలయానికి సంబంధించిన సంపద, నిర్వహణ బాధ్యతలు ట్రావెన్‌కోర్ రాజవంశీయుల నుంచి స్వాధీనం చేసుకుని, దానికి సంబంధించి ఒక కమిటీ వేయాలని కేరళ హైకోర్టు 2011 జనవరి 31న తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ.. ట్రావెన్‌కోర్ రాజ వంశీయులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన ధర్మాసనం ఏప్రిల్ 2019లో తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. నేడు అనంత పద్మనాభ స్వామి ఆలయ బాధ్యతలను ట్రావెన్‌కోర్ వంశానికే అప్పగిస్తూ తీర్పును వెలువరించింది.

More News

రాజధానులపై అంత పట్టుదలా.. చంద్రబాబుకు ప్రయోజనం చేకూరవద్దనేనా?

ముచ్చటగా మూడు రాజధానులు.. తెలుగు రాష్ట్రాల్లో గతంలో ఎప్పుడూ కనీవినని కాన్సెప్ట్.

కరోనా నెక్లెస్.. అరగంట వేసుకుంటే 80 శాతం వైరస్ అవుట్..

కరోనా వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందో తెలియదు. అన్ని దేశాలూ అదే పనిలో బిజిబిజీగా ఉన్నాయి.

తెలంగాణలో మూడు రోజులుగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు

తెలంగాణలో గత మూడు రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కాస్త తగ్గుతూ వస్తోంది. అంతకు ముందు 1800లకు పైన నమోదైన కేసులు..

బిగ్‌బికి ధైర్యం చెప్పిన కాసేపటికే.. అనుపమ్ ఖేర్‌ ఇంట కరోనా కల్లోలం

కరోనా మహమ్మారి బాలీవుడ్‌ను భయపెడుతుంది. బిగ్‌బి అమితాబ్ బచ్చన్‌కు కరోనా అని ఆయన తన ట్విట్టర్ ద్వారా వెల్లడించగానే బాలీవుడ్ ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్

ఐశ్వర్యారాయ్.. ఆమె కూతురు ఆరాధ్యకూ కరోనా పాజిటివ్

ప్రముఖ నటి, అభిషేక్ బచ్చన్ భార్య ఐశ్వర్యారాయ్ బచ్చన్, వారి కూతురు ఆరాధ్యకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.