CM Jagan:బెయిల్ రద్దుపై సీఎం జగన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు

  • IndiaGlitz, [Friday,November 24 2023]

ఏపీ సీఎం జగన్ మోహన్‌ రెడ్డి కోర్టుల నుంచి నోటీసుల మీద నోటీసులు జారీ అవుతున్నాయి. తాజాగా అక్రమాస్తుల కేసులో జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ పంకజ్ మిట్టల్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ నిర్వహించింది. జగన్‌ బెయిల్‌ను సీబీఐ, ఈడీ కనీసం సవాలు చేయలేదని రఘురామ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ఇప్పుడే బెయిల్ రద్దు చేయాలా? అని ధర్మాసనం ప్రశ్నించగా.. నోటీసులు ఇచ్చి తదుపరి ప్రక్రియ చేపట్టాలని కోరారు. దీంతో జగన్‌, సీబీఐ సహా ప్రతివాదులందరికీ న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసులో విచారణను హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి మార్చాలని రఘురామ వేసిన పిటిషన్‌ను సైతం ఇందులో జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది.

మరోవైపు పదేళ్లుగా నెమ్మదిగా సాగుతున్న జగన్ అక్రమాస్తుల కేసుల విచారణను తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో రఘురామకృష్ణరాజు పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం విచారణ ఎందుకు ఆలస్యమవుతుందో చెప్పాలని సీబీఐకి నోటీసులు జారీ చేసింది. అలాగే రఘురామ వేసిన కేసుల బదిలీ పిటిషన్‌ను ఎందుకు విచారించకూడదో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఈ క్రమంలో జగన్‌, ఎంపీ విజయసాయిరెడ్డి సహా ప్రతివాదులందరికీ నోటీసులు జారీచేసిన ధర్మాసనం.. తదుపరి విచారణను జనవరికి వాయిదా వేసింది.

ఇదిలా ఉంటే వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరపాలని కోరుతూ రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు సీఎం జగన్ సహా 41 మందిని ప్రతివాదులుగా చేరుస్తూ నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై ప్రభుత్వం తరపున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ అసలు ఈ పిటిషన్ విచారణకు అర్హత లేదని తెలిపారు. రఘురామ తరఫున సీనియర్ న్యాయవాది మురళీధర్ రావు వాదనలు వినిపిస్తూ పిటిషన్ దాఖలు చేయగానే ప్రభుత్వం కొన్ని రికార్డులను ధ్వంసం చేసిందని ఆరోపించారు. దీంతో న్యాయస్థానం పిటిషన్‌పై విచారణ చేపడతామని స్పష్టంచేస్తూ తదుపరి విచారణను డిసెంబర్ 14కు వాయిదా వేసింది. మొత్తానికి ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇటు హైకోర్టు, అటు సుప్రీంకోర్టు నుంచి సీఎం జగన్‌కు వరుస నోటీసులు రావడం వైసీపీ శ్రేణులను కలవరపరుస్తోంది.

More News

Bhagwant Kesari:బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్.. ఓటీటీలోకి వచ్చేసిన 'భగవంత్ కేసరి'..

నటసింహం నందమూరి బాలకృష్ణ అభిమానులకు శుభవార్త. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది.

Bigg Boss Telugu 7 : గౌతమ్‌ను చంపలేకపోయిన శివాజీ.. కిల్లర్‌గా ప్రియాంక, శోభాశెట్టి కోసం తొండాట

బిగ్‌బాస్ 7 తెలుగు ఉత్కంఠగా సాగుతున్న సంగతి తెలిసిందే.  మిసెస్ బిగ్‌బాస్ దారుణ హత్యకు గురికావడంతో ఆమెను చంపింది ఎవరో తెలుసుకోవాలంటూ బిగ్‌బాస్ టాస్క్ ఇచ్చాడు.

KCR:పరేడ్ గ్రౌండ్స్‌లో కేసీఆర్ సభ రద్దు.. ఎందుకంటే..?

తెలంగాణ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గర పడింది. ప్రచారానికి కూడా కేవలం ఐదు రోజులు మాత్రమే సమయం ఉంది.

Modi and Amit Shah:తెలంగాణలో బీజేపీ దూకుడు.. మోదీ, అమిత్ షా రాష్ట్రంలోనే మకాం..

తెలంగాణ ఎన్నికలు చివరి దశకు చేరడంతో బీజేపీ అగ్రనేతలు ప్రచారంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రధాని మోదీ సహా కేంద్ర హోంమంత్రి అమిత్ షా,

Barrelakka:బర్రెలక్కకు పెరుగుతున్న ప్రముఖుల మద్దతు.. తాజాగా తెలుగు హీరో సపోర్ట్..

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు మార్మోగుతున్న పేరు బర్రెలక్క అలియాస్ శిరీష. స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యే స్థానానికి ఆమె పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.