ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరోసారి షాక్..
Send us your feedback to audioarticles@vaarta.com
నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వానికి మరోసారి చుక్కెదురైంది. ఆయన వ్యవహారంలో స్టే ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించడంతో పాటు ఏపీ ప్రభుత్వ వైఖరిపై చురకలంటించింది. రమేష్‌కుమార్ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. రమేష్ కుమార్ తరుఫున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపించారు.
హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వం అమలు చేయడం లేదని హరీష్ సాల్వే సుప్రీంకోర్టుకు వివరించారు. దీంతో వచ్చే శుక్రవారంలోపు హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలని సుప్రీం కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. గవర్నర్ లేఖ పంపినా రమేష్ కుమార్‌కు పోస్టింగ్ ఇవ్వకపోవడం దారుణమని పేర్కొంది. గవర్నర్ సలహాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందని సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. మొత్తంగా హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరిస్తున్నామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout