ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరోసారి షాక్..

  • IndiaGlitz, [Friday,July 24 2020]

నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వానికి మరోసారి చుక్కెదురైంది. ఆయన వ్యవహారంలో స్టే ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించడంతో పాటు ఏపీ ప్రభుత్వ వైఖరిపై చురకలంటించింది. రమేష్‌కుమార్ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. రమేష్ కుమార్ తరుఫున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపించారు.

హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వం అమలు చేయడం లేదని హరీష్ సాల్వే సుప్రీంకోర్టుకు వివరించారు. దీంతో వచ్చే శుక్రవారంలోపు హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలని సుప్రీం కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. గవర్నర్ లేఖ పంపినా రమేష్ కుమార్‌కు పోస్టింగ్ ఇవ్వకపోవడం దారుణమని పేర్కొంది. గవర్నర్ సలహాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందని సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. మొత్తంగా హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరిస్తున్నామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

More News

శ్రీవారి సమక్షంలో ఇంతటి విషాదమా!.. కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన..

తిరుమల శ్రీవారికి నిత్యం సేవలందించే ఓ ఉద్యోగి విషయంలో జరిగిన దారుణం వింటే కన్నీళ్లు తెప్పించక మానదు.

దేశంలో 13 లక్షలకు చేరువవుతున్న కరోనా కేసులు..

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. కరోనా కేసుల్లో ప్రస్తుతం మూడో స్థానంలో ఇండియా కొనసాగుతోంది.

దేశంలో 18 కోట్ల మందికి కరోనా.. షాకింగ్ విషయాలు చెప్పిన థైరోకేర్

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. మరోవైపు ఇండియాలో కరోనా మరింత తీవ్ర స్థాయిలో పెరిగిపోయింది.

‘బిచ్చగాడు 2’ ఫస్ట్‌లుక్ విడుదల

మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ఎన్నో సూప‌ర్‌హిట్ చిత్రాల‌కు సంగీతాన్ని అందించిన విజ‌య్ ఆంటోని.. హీరోగా,నిర్మాత‌గా నకిలీ’ సినిమాను నిర్మించారు.

హోం ఐసోలేషన్‌లో మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత

తెలంగాణలో మరీ ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా ఏ స్థాయిలో విస్తరిస్తోందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.