సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి మరోసారి ఎదురుదెబ్బ
Send us your feedback to audioarticles@vaarta.com
సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లీష్ మీడియంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసులో ప్రతివాదులకు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది విశ్వనాథన్ వాదనలు వినిపించారు. హైకోర్టు తీర్పుపై స్టేతో పాటు నోటీస్ ఇవ్వాలని విశ్వనాథన్ కోరారు.
మాతృభాషలోనే విద్యాబోధన జరగాలన్న నిబంధన చట్టంలో లేదని విశ్వనాథన్ పేర్కొన్నారు. ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధన జరగాలన్న... ప్రభుత్వ నిర్ణయం ప్రగతిశీలమని విశ్వనాథన్ వాదించారు.
తెలుగు మీడియం విద్యా బోధన వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో... హాజరు శాతం తీవ్రంగా తగ్గిపోతుందని విశ్వనాథన్ కోర్టుకు వెల్లడించారు. కాగా.. ప్రతివాదుల తరపున సీనియర్ న్యాయవాది శంకర్నారాయణ వాదనలు వినిపించారు. విద్యార్థులు తెలుగు మీడియాన్ని ఎంచుకునే అవకాశాన్ని... ప్రభుత్వం కాలరాస్తోందని శంకర్ నారాయణ పేర్కొన్నారు. తెలుగు మీడియం పాఠశాలలు పూర్తిగా కనుమరుగు చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రతివాదులు అఫిడవిట్ దాఖలు చేశాక... స్టే అంశాన్ని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
జస్టిస్ చంద్రచూడ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
కాగా.. ఏపీలో ఇంగ్లిష్ మీడియంపై జస్టిస్ చంద్రచూడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవకాశం లేకపోతే ఇంగ్లిష్ మీడియంలో బోధించవచ్చన్నారు. తెలుగులో బోధించే అవకాశం ఉన్నప్పుడు ఇంగ్లిష్ అవసరమేంటని ప్రశ్నించారు. తెలుగులో బోధనా సిబ్బంది కొరత ఉందా? అని చంద్రచూడ్ ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం లేనందువల్ల... విద్యార్థులు ప్రైవేట్ స్కూల్స్ వైపు మొగ్గుచూపుతున్నారని విశ్వనాథన్ పేర్కొన్నారు. తల్లిదండ్రులపై ఆర్థికభారం పడకుండా ఉండేందుకు... ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టామని విశ్వనాథన్ కోర్టుకు వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments