Chandrababu:చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

  • IndiaGlitz, [Thursday,November 09 2023]

స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టు తీర్పు వాయిదా వేసింది. పాత ఆర్డర్ ప్రకారం దీపావళి సెలవుల అనంతరం తీర్పు ఇస్తామని పేర్కొంది. అటు ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. అంతవరకూ చంద్రబాబును అరెస్ట్ చేయవద్దని సీఐడీని ఆదేశించింది. ఫైబర్ నెట్ కేసులో అక్టోబర్ 9న చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో దర్యాప్తు కీలక దశలో ఉన్నందున బెయిలు ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

నవంబర్‌ 30వ తేదీలోగా క్వాష్ పిటిషన్‌పై తుది ఉత్తర్వులు వెలువడితే ఫైబర్‌ గ్రిడ్‌ కేసు విషయంలోనూ సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఫైబర్‌గ్రిడ్ కేసులో మిగిలిన నిందితులకు ఇప్పటికే ముందస్తు బెయిల్ మంజూరు అయినందున తనకు కూడా బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు కోరుతున్నారు. మరోవైపు ఈ వ్యవహారంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారని సీఐడీ అభియోగాలు మోపింది. దీంతో సర్వోన్నత న్యాయస్థానం ఏ నిర్ణయం తీసుకుంటుందనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

ఇక స్కిల్ కేసులో మధ్యంతర బెయిల్‌పై చంద్రబాబు విడుదలైన సంగతి తెలిసిందే. అనారోగ్యంతో అక్టోబర్ 31న రాజమండ్రి జైలు నుంచి విడుదలైన చంద్రబాబు.. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో కంటి ఆపరేషన్ చేయించుకున్నారు. మరోవైపు ఈ కేసులో చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై రేపు హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ విచారణలో న్యాయస్థానం బెయిల్ ఇస్తే చంద్రబాబుకు ఊరట లభించనుంది. లేని పక్షంలో నవంబర్ 28 సాయంత్ర 5గంటల లోపు జైలులో సరెండర్ అవ్వాలి.

More News

CM KCR:గజ్వేల్‌లో నామినేషన్ వేసిన సీఎం కేసీఆర్..

తెలంగాణ ఎన్నికల్లో నామినేషన్ల అంఖం తుది దశకు చేరుకుంది. రేపటితో నామినేషన్ల దాఖలుకు గడువు ముగియనుంది.

Bigg Boss Telugu 7 : హగ్గులు, ముద్దులతో ప్రియాంకను ముంచెత్తిన ప్రియుడు.. కిచెన్‌కే అంకితమవుతావా హిత బోధ

బిగ్‌బాస్ హౌస్‌లో గొడవలు, వాగ్వాదాలకు బదులుగా ఈ వారం ఎమోషనల్ టచ్ ఇస్తున్నారు నిర్వాహకులు. కుటుంబ సభ్యులను, మిత్రులను హౌస్‌లోకి పంపుతూ కంటెస్టెంట్స్‌‌ను ఖుషీ చేస్తున్నారు.

Rashmika Mandanna : రష్మికకు తెలుగు ఫిలిం జర్నలిస్ట్‌ల బాసట .. తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా పేరుతో వైరల్ అవుతోన్న మార్ఫింగ్ వీడియో ప్రస్తుతం టాక్ ఆఫ్ ది నేషన్‌గా మారింది.

MP Ponguleti:చెప్పినట్లే జరిగింది.. మాజీ ఎంపీ పొంగులేటి ఇంటిపై ఐటీ దాడులు..

ఓవైపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వాడివేడిగా జరుగుతుండగా.. మరోవైపు కాంగ్రెస్ నేతల ఇళ్లు, కార్యాలయాల్లో

Pawan Kalyan: పవన్ కల్యాణ్‌ మద్దతు కోరిన లండన్ మేయర్ అభ్యర్థి

లండన్‌ మేయర్‌ ఎన్నికల బరిలో ఉన్న భారత సంతతికి చెందిన అభ్యర్థి తరుణ్ గులాటీ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కలిశారు.