Chandrababu Naidu: బెయిల్ రద్దుపై చంద్రబాబుకు సుప్రీంకోర్టు నోటీసులు
Send us your feedback to audioarticles@vaarta.com
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ సతీష్ కుమార్ మిశ్రా ధర్మాసనం బెయిల్ రద్దు అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబుకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో 17ఏపై తీర్పు వచ్చిన తర్వాతే బెయిల్ రద్దు కేసు వింటామని తెలిపింది. తదుపరి విచారణ వరకు ఇరు పక్షాలూ ఈ కేసు వివరాలు ఎక్కడా మాట్లాడవద్దని సూచించింది. అయితే చంద్రబాబు ర్యాలీలు, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనవచ్చని స్పష్టంచేస్తూ తదుపరి విచారణను డిసెంబర్ 8వ తేదీకి వాయిదా వేసింది.
విచారణ సందర్భంగా చంద్రబాబు రాజకీయ ర్యాలీలు, సభలు, సమావేశాలూ నిర్వహించకుండా ఆదేశాలు ఇవ్వాలన్న సీఐడీ అభ్యర్ధనను ధర్మాసనం తోసిపుచ్చింది. కాగా స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు నవంబర్ 20న ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. న్యాయస్థానం తీర్పును సుప్రీంకోర్టులో సీఐడీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబుకు బెయిల్ విషయంలో హైకోర్టు పరిధి దాటి వ్యవహరించిందని పేర్కొంది. బెయిల్ మంజూరులో తమ వాదనలు హైకోర్టు ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదని పిటిషన్‌లో వెల్లడించింది.
మరోవైపు స్కిల్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో తీర్పు రిజర్వ్‌లో ఉంది. ఈనెల 30వ తేదీ లోపు తీర్పు వస్తుందని అనుకుంటున్నారు. కానీ ఇంతవరకు దానిపై స్పష్టతలేదు. ఈ కేసులో అవినీతి చేశారని ఆరోపిస్తూ సెప్టెంబర్ 9వ తేదీన చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంతో 52రోజల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు.
గత నెల 31న హైకోర్టు ఆయనకు అనారోగ్య కారణాల రీత్యా మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి బయటకు వచ్చారు. అనంతరం ఆయన హైదరాబాద్‌లో కంటికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. అప్పటి నుంచి హైదరాబాద్‌లోని తన నివాసంలో రెస్ట్ తీసుకుంటున్నారు. ఇవాళ్టితో హైకోర్టు చంద్రబాబుకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ షరతులు ముగియనున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com