ఏపీలో పంచాయతీ ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీ పంచాయతీ ఎన్నికలకు ముందు జరుగుతున్న వైసీపీ ప్రభుత్వం వర్సెస్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ మధ్య జరుగుతున్న సమరానికి సుప్రీంకోర్టు ఫుల్‌స్టాప్ పెట్టేసింది. ఏపీలో పంచాయతీ ఎన్నికలకు సుప్రీంకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల నిర్వహణకు అనుమతినిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ హృషికేశ్ రాయ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. రాజ్యాంగ విచ్ఛిన్నాన్ని అంగీకరించమని ధర్మాసనం తేల్చి చెప్పింది.
వ్యాక్సినేషన్ ఎన్నికలకు అడ్డంకి కానే కాదని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం తరుఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. పలు రాష్ట్రాల్లో స్థానిక ఎన్నికలను కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం వాయిదా వేసిన విషయాన్ని.. రోహత్గి కోర్టుకు వెల్లడించారు. రాష్ట్ర హైకోర్టు సింగిల్ జడ్జి ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ తీర్పు ఇచ్చారని రోహత్గి కోర్టుకు వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం ఎన్నికలను వాయిదా వేయడం కుదరదని స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల తీరుపై సైతం సుప్రీంకోర్టు స్పందించింది. ఉద్యోగ సంఘాలు చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని, రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయంలో జోక్యం చేసుకోమని తెలిపింది.
ఇందులో ప్రభుత్వ ఉద్యోగుల జోక్యం మంచిది కాదని, రెండు వ్యవస్థల మధ్య ఉన్న వ్యవహారంతో మీకేం సంబంధమని వ్యాఖ్యానించింది. దేశంలో ఎక్కడా ఎన్నికలు జరగట్లేదా అన్న ధర్మాసనం.. ఎన్నికలు రాజ్యాంగ ప్రక్రియలో భాగమని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఏదో ఒక రకంగా ఎన్నికలు ఆపాలని చూస్తున్నారన్నారు. మీ రాతల మీ ఉద్దేశ్యాన్ని తెలియజేస్తాయని.. మీరు ఎన్నికల కమిషన్‌పై రాసిన విధానం మీ ాలోచనలను తెలియజేస్తాయన్నారు. కరోనా ఉన్నప్పుడు ఎన్నికలు కావాలని కోరిన విషయాన్ని జస్టిస్ కౌల్ ప్రస్తావించారు. ఈసీని తప్పుబడుతూ దురుద్దేశాలు ఆపాదిస్తున్నారన్నారు. ఎస్‌ఈసీ సమావేశానికి ఉద్యోగ సంఘాలు ఎందుకు హాజరు కాలేదని జస్టిస్ కౌల్ ప్రశ్నించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com