High Court:తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త సీజేలు : ఏపీకి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, తెలంగాణకు జస్టిస్ అలోక్ అరదే
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు రానున్నారు. బాంబే హైకోర్ట్ న్యాయమూర్తిగా వున్న జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్‌ను ఏపీకి, కర్ణాటక హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరధేను తెలంగాణ హైకోర్ట్ సీజేగా నియమించాలని సుప్రీంకోర్ట్ కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది. దీనికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తే నియమకాలు అధికారికంగా ఖరారవుతాయి.
దేశంలోని పలు రాష్ట్రాల హైకోర్టులు, సుప్రీంకోర్టులో ఖాళీగా వున్న న్యాయమూర్తుల భర్తీపై సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజియం సమావేశమైంది. అనంతరం ఏపీ , తెలంగాణతో పాటు బొంబాయి. గుజరాత్, ఒడిషా, కేరళ రాష్ట్రాల హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తుల పేర్లను సిఫారసు చేసింది. గుజరాత్‌కు జస్టిస్ సునీతా అగర్వాల్ , బొంబాయి హైకోర్టుకు జస్టిస్ దేవేంద్ర కుమార్, మణిపూర్‌కు జస్టిస్ సిద్ధార్థ్ మృదుల్, కేరళకు జస్టిస్ ఆశిష్ దేశాయ్, ఒడిశాకు జస్టిస్ సుబాసిస్ తలపత్రను ప్రధాన న్యాయమూర్తులుగా నియమించాలని కొలీజియం సిఫార్సు చేసింది.
అటు సుప్రీంకోర్టులో ఖాళీగా వున్న మూడు న్యాయమూర్తుల పదవులకు కూడా కొలీజియం సిఫారసులు చేసింది. సర్వోన్నత న్యాయస్థానంలో 34 మంది న్యాయమూర్తులకు గాను ప్రస్తుతం 31 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. దీనిలో ఇద్దరు న్యాయమూర్తులను కొలీజియం సిఫారసు చేసింది. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఉజ్జల్ భూయాన్, కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఎస్. వెంకటనారాయణ భట్ పేర్లను కేంద్రానికి సిఫారసు చేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout