చిరంజీవి తల్లి అంజనా దేవి, అల్లు అరవింద్ సమక్షంలో ఘనంగా సుప్రీమ్ ఆడియో విడుదల
- IndiaGlitz, [Thursday,April 14 2016]
మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ - రాశీ ఖన్నా జంటగా నటించిన చిత్రం సుప్రీమ్. ఈ చిత్రాన్ని పటాస్ ఫేం అనిల్ రావిపూడి తెరకెక్కించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. సాయి కార్తీక్ సంగీతం అందించిన సుప్రీమ్ ఆడియో ఆవిష్కరణోత్సవం హైదరాబాద్ శిల్పకళావేదికలో సినీ ప్రముఖులు, అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగింది. చిరంజీవి తల్లి అంజనా దేవి, అల్లు అరవింద్ సుప్రీమ్ ఆడియోను ఆవిష్కరించి తొలి సి.డి.ని యువ హీరోలు వరుణ్ తేజ్, నానికి అందచేయగా..వరుణ్ తేజ్, నాని సుప్రీమ్ థియేట్రికల్ ట్రైలర్ను రిలీజ్ చేసారు.
ఈ సందర్భంగా గీత రచయిత రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ...సుప్రీమ్ అనే టైటిల్ లో ఒక పవర్ ఉంది. నాకు ఈ సినిమా కథ గురించి తెలుసు. ఈ సినిమా మరో పసివాడి ప్రాణం అవుతుంది. ఈ చిత్రంలో ఒక చిన్నపిల్లోడు నటించాడు. అందరి కన్నా ఎక్కువ మార్కులు ఆ చిన్నపిల్లోడు కొట్టేస్తాడు. సాయి కార్తీక్ కి సుప్రీమ్ మంచి ఆల్బమ్.. లోకల్ టాలెంట్ ని ప్రొత్సహిస్తున్న సాయి కార్తీక్ ని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. ఇందులో ఆంజనేయస్వామి గురించి ఓ పాట రాసాను. ఈ పాట అందర్నీ ఆకట్టుకుంటుంది. ఇందులో మూడు పాటలు రాసే అవకాశం ఇచ్చిన అనిల్ రావిపూడికి థ్యాంక్స్ తెలియచేస్తున్నాను. సుప్రీమ్ పటాస్ ను మించిన విజయం సాధిస్తుంది అన్నారు.
డైరెక్టర్ మలినేని గోపీచంద్ మాట్లాడుతూ... నాకు బాగా ఇష్టమైన హీరో సాయిధరమ్ తేజ్ సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాతో మాస్ లో మంచి క్రేజ్ ఏర్పరుచుకున్నాడు. సుప్రీమ్ సినిమాతో తేజు కి మాస్ లో ఫాలోయింగ్ మరింత పెరుగుతుంది. హీరోయిన్ రాశీ ఖన్నా బెల్లం శ్రీదేవిగా అద్భుతంగా నటించింది. సుప్రీమ్ సినిమాలోని రెండు పాటలు చూసాను. ఎక్స్ ట్రార్డినరీగా ఉన్నాయి. అనిల్ రావిపూడిలో మంచి కమర్షియల్ డైరెక్టర్ ఉన్నాడు. దిల్ రాజు గారి బ్యానర్ నుంచి వస్తున్న పక్కా మాస్ సినిమా ఇది. ఖచ్చితంగా సుప్రీమ్ బ్లాక్ బష్టర్ అవుతుంది అన్నారు.
డైరెక్టర్ హరీష్ శంకర్ మాట్లాడుతూ...తేజు నాకు బాగా ఇష్టమైన హీరో. దిల్ రాజు గారు ఇష్టమైన నిర్మాత. వీరిద్దరూ కలిసి చేసిన ఈ సినిమా ఖచ్చితంగా అందరికి నచ్చుతుంది. తేజు మావయ్యలకు చెడ్డ పేరు తీసుకురాకూడదు అని భయంతో ఉంటుంటాడు. చెడ్డపేరు తీసుకురాకూడదనే ఆ భయమే తేజుకి సక్సెస్ ని అందిస్తుంటుంది. అన్నివర్గాల ప్రేక్షకులను అలరించి సుప్రీమ్ బ్లాక్ బష్టర్ అవుతుంది అన్నారు.
డైరెక్టర్ వంశీ పైడిపల్లి మాట్లాడుతూ... సాయిధరమ్ తేజ్ నాకు తమ్ముడుతో సమానం. డైరెక్టర్ అనిల్ లో చాలా ఎనర్జి ఉంది. ఆ ఎనర్జి అంతా ఈ సినిమాలో కనిపిస్తుంది అనుకుంటున్నాను. దిల్ రాజు గారి సినిమాలు బ్లాక్ బష్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.
హీరోయిన్ రాశీ ఖన్నా మాట్లాడుతూ... అనిల్ టాలెంటెడ్ డైరెక్టర్. ఈ సినిమాలో నాకు అన్ని పాటలు బాగా నచ్చాయి. సాయి కార్తీక్ చాలా మంచి సంగీతాన్ని అందించాడు. సాయిధరమ్ తేజ్ డాన్స్ అదరగొట్టేసాడు. తోటి నటీనటుల పై తేజు చూపించే అభిమానం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది.నన్ను ఎంతగానో ప్రొత్సహించిన దిల్ రాజు గార్కి థ్యాంక్స్ తెలియచేస్తున్నాను అన్నారు.
సంగీత దర్శకుడు సాయి కార్తీక్ మాట్లాడుతూ...గత సంవత్సరం అనిల్ పటాస్ తో మంచి హిట్ ఇచ్చారు. ఈ సంవత్సరం అంత కన్నా పెద్ద విజయాన్ని అందిస్తున్నందుకు డైరెక్టర్ అనిల్ కి థ్యాంక్స్ తెలియచేస్తున్నాను. ఈ సినిమాలోని పాటలకు సాయిధరమ్ తేజ్ డాన్స్ అదరగొట్టేసాడు. సుప్రీమ్ పెద్ద విజయాన్ని సాధిస్తుంది అన్నారు.
హీరో నాని మాట్లాడుతూ...తేజు ని చూస్తే చిరంజీవి గారు గుర్తుకువస్తారు. తేజు చిరంజీవి గారంత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను. అలా..మొదలైంది సినిమాలో తాగుబోతు రమేష్..ఎపిసోడ్ ని అనిల్ రాసాడు. ఎంటర్ టైన్మెంట్ బాగా రాస్తాడు అనిల్.ఈ సినిమాలో కూడా ఎంటర్ టైన్మెంట్ బాగా ఉంటుంది. సాయి కార్తీక్ ఈ సినిమాతో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. దిల్ రాజు గారి బ్యానర్ లో ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నాను కుదరలేదు. ఇప్పటి కి కుదిరింది త్వరలో రాజు గారి బ్యానర్ లో సినిమా చేస్తున్నాను అన్నారు.
వరుణ్ తేజ్ మాట్లాడుతూ... నా ఆడియో ఫంక్షన్ కి కాకుండా వేరే ఆడియో ఫంక్షన్ కి రావడం ఇదే ఫస్ట్ టైమ్. నాకు తెలిసిన వాళ్లలో బాగా కష్టపడే హీరో అంటే తేజు. నాకు ఇన్ స్పిరేషన్ అంటే తేజునే. అనిల్ తీసిన పటాస్ మూవీ చూసాను. నాకు బాగా నచ్చింది. సుప్రీమ్ పెద్ద సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు.
డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ...పటాస్ సినిమా ఫస్ట్ సినిమా అయినా చాలా కాన్పిడెంట్ గా తీసాను. సెకండ్ సినిమా సుప్రీమ్ ని చాలా జాగ్రత్తగా భయంతో తీసాను. ట్రైలర్ లో 5 పర్సెంట్ మాత్రమే చూసారు. సుప్రీమ్ సినిమాలో యూత్, ఫ్యామిలీ ఆడియోన్స్, పిల్లలు..ఇలా అన్నివర్గాల ప్రేక్షకులకు కావాలసిన అన్ని అంశాలు ఉన్నాయి. ఈ సినిమా ద్వారా గొప్ప విషయం నేర్చుకున్నాను. అది ఏమిటంటే.. ఆర్టిస్ట్ ల రిస్క్ ఎలా ఉంటుందో దగ్గర నుంచి చూసాను. రాజస్ధాన్ లో షూటింగ్ చేస్తున్నప్పుడు రవి కిషన్ గార్కి యాక్సడెంట్ అయ్యింది. మాకు నచ్చింది తెరపైకి రావడానికి ఆర్టిస్టులు పడే కష్టం ఎలా ఉంటుందో తెలిసింది. అంత పెద్ద యాక్సిడెంట్ జరిగినా రవి కిషన్ గారు షూటింగ్ చేసి మాకు ఎంతగానో సహకరించారు. దిల్ రాజు గారు నాకు గైడ్ గా ఉండి సినిమా బాగా రావడానికి మంచి సలహాలు ఇచ్చేవారు. తేజ్ ఈ సినిమాలో చాలా మెచ్యూర్డ్ గా నటించి ఆల్ రౌండర్ పెర్ ఫార్మెన్స్ చూపించాడు. రాశీ కన్నా ఈ సినిమాలో హీరోయిన్ కాదు కమెడియన్. పాత్రకు తగ్గట్టు చాలా బాగా నటించింది. సుప్రీమ్ అనే సినిమా టెక్నీషియన్ మూవీ. సుప్రీమ్ సమ్మర్ లో మంచి ఎంటర్ టైనర్ అలరిస్తుంది అన్నారు.
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ...2002లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ ప్రారంభించాం. 13 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ జర్నీలో 20 సినిమాలు నిర్మిస్తే అందులో 16 విజయవంతమైన చిత్రాలు నిర్మించాం. 7 గురు డైరెక్టర్స్ ని పరిచయం చేసాం. ఈ సినిమాతో ఫస్ట్ టైం దిల్ రాజు ప్రజెంట్స్ అని వేసి శిరీష్ ని నిర్మాతగా పరిచయం చేస్తున్నాం. మరో పది సంవత్సరాలు సక్సస్ ఫుల్ మూవీస్ చేయాలని సంకల్పంతో ఉన్నాం. తేజు చేసిన నాలుగు సినిమాల్లో మూడు సినిమాలు మా బ్యానర్ నే చేసాడు. తేజుతో మాకు సుప్రీమ్ సినిమా హ్యాట్రీక్ కాబోతుంది. తేజు సుప్రీమ్ తో ఇంకోక లెవెల్ కి ఎదుగుతాడు. చిరంజీవి గారితో సినిమా చేయాలనుకున్నాను తేజుతో కంప్లీట్ చేసాను. పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయాలనుకున్నాను వరుణ్ తేజ్ తో చేస్తున్నాను. సమ్మర్ లో మా సంస్థ నుంచి వస్తున్న సుప్రీమ్ సక్సెస్ ఫుల్ మూవీగా నిలుస్తుంది అన్నారు.
నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ...దిల్ రాజు అంటే మా ఫ్యామిలీ ప్రొడ్యూసర్. తేజు సినిమాల విషయంలో దిల్ రాజు చాలా జాగ్రత్త తీసుకుంటూన్నాడు. తేజుతో వరుసగా సినిమాలు తీస్తున్న దిల్ రాజు బయట ప్రొడ్యూసర్స్ కి కూడా తేజుతో సినిమా చేసే అవకాశం ఇవ్వాలి. రవి కిషన్ సెకండ్ టైమ్ మా ఫ్యామిలీ హీరోతో వర్క్ చేసారు. సాయి కార్తీక్ మంచి ట్యూన్స్ ఇచ్చాడు. తోటి హీరోల ఆడియో ఫంక్షన్స్ కి హీరోలు రావడం అనేది తక్కువ. ఈ ఫంక్షన్ కి వచ్చిన నాని, వరుణ్ ని అభినందిస్తున్నాను. కష్టపడేతత్వం ఉన్న తేజుని సినిమాల పై ఉన్న ఆ ఇంట్రెస్టే అతన్ని ఎక్కడో తీసుకెళ్లుతుంది. ఈ సినిమా ఆల్ రెడీ హిట్ అయ్యింది అనే ఫీల్ కలుగుతుంది అన్నారు.
హీరో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ...అభిమానుల్లో ఒకటిగా ఉండే నేను ఈరోజు హీరో అయ్యానంటే కారణం ముగ్గురు మావయ్యలు. ఈ సందర్భంగా నా ముగ్గురు మామయ్యలకు పాదాభివందనం చేస్తున్నాను. ఈ సినిమాకి సుప్రీమ్ టైటిల్ అని చెప్పినప్పుడు గుండెల్లో రైలు పరుగెట్టినట్టు అనిపించింది. చిరంజీవి గార్కి ఆ టైటిల్ సరిపోతుంది. కానీ..నాకు ఆ టైటిల్ ఏమిటి అనిపించి మావయ్యను కలిసి చెప్పాను. మావయ్య కష్టపడి వర్క్ చేయి టైటిల్ అదే వస్తుంది అని చెప్పారు. అప్పుడు రక్తం చిందించైనా సరే కష్టపడాలి అని డిసైడ్ అయ్యాను. సుప్రీమ్ టైటిల్ నాది కాదు చిరంజీవి మావయ్య టైటిల్. ఆ టైటిల్ పెట్టినందుకు పరువు నిలబెట్టాలని కష్టపడ్డాను. మావయ్య చెప్పిన మాటలు వింటే నాలో వెయ్యి ఏనుగుల బలం వచ్చింది. దిల్ రాజు గారు మా ఫ్యామిలీ మెంబర్ . నన్ను ఎంతగానో ప్రొత్సహించేవారు. మంచి ప్రాజెక్ట్ తీసుకురావాలని శిరీష్ ,లక్ష్మణ్ ఎంతో హార్డ్ వర్క్ చేసారు. డైరెక్టర్ అనిల్ నాకు బాగా ఎనర్జి ఇచ్చాడు. ఈ సినిమాలో నేను బాగా చేసానంటే దానికి కారణం మా డైరెక్టర్ అనిల్. సాయి కార్తీక్ చాలా మంచి ఆల్బమ్ ఇచ్చారు. సాయితో ఫ్యూచర్ లో కూడా వర్క్ చేయాలనుకుంటున్నాను. నేను ఎప్పటికీ అభిమానిగా ఉండాలనుకుంటున్నాను అన్నారు.