ఘనంగా సుప్రీమ్ అర్థ శతదినోత్సవం
Send us your feedback to audioarticles@vaarta.com
సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా పటాస్ ఫేమ్ అనిల్ రవిపూడి తెరకెక్కించిన కమర్షియల్ ఎంటర్ టైనర్ సుప్రీమ్. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించారు. సాయిధరమ్ తేజ్ - రాశీఖన్నా జంటగా నటించిన సుప్రీమ్ అన్నివర్గాల ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా యాభై రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సుప్రీమ్ అర్ధశతదినోత్సవం ప్రసాద్ ల్యాబ్స్ జరిగింది.
ఈ కార్యక్రమంలో హీరో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ....వై.వి.ఎస్ చౌదరి గారు తొలి అవకాశం ఇచ్చినా... పిల్లా నువ్వులేని జీవితం ఫస్ట్ ఫిల్మ్ గా రిలీజైంది. దిల్ రాజు గారి బ్యానర్ లో వరుసగా మూడు సినిమాలు చేసాను. పిల్లా నువ్వులేని జీవితం చిత్రానికి యాభై రోజుల వేడుక జరుపుకున్నాం. ఇప్పుడు సుప్రీమ్ సినిమాకి కూడా యాభై రోజులు వేడుక జరుపుకోవడం ఆనందంగా ఉంది. యాక్షన్, కామెడీ, సెంటిమెంట్...ఇలా అన్నిఅంశాలు ఉన్నమంచి క్యారెక్టర్ చేసే అవకాశాన్ని డైరెక్టర్ అనిల్ ఇచ్చా రు. సాయి కార్తీక్ అదిరిపోయే మ్యూజిక్ అందించాడు. ఈ సినిమాని ఆదరించి మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్ అన్నారు.
డైరెక్టర్ అనిల్ రవిపూడి మాట్లాడుతూ...కథ విని అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ అయినా నన్ను నమ్మి ఎంతగానో ప్రొత్సహించిన దిల్ రాజు గార్కి థ్యాంక్స్ తెలియచేస్తున్నాను. ఈ మూవీలో నటించిన ప్రతి ఆర్టిస్ట్ నాపై ప్రేమతో వర్క్ చేసారు. రాజేంద్రప్రసాద్ గారు గొప్పనటుడు. ఆయనతో మరిన్ని సినిమాలు చేస్తాను. ఈ సినిమాకి సహకరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అన్నారు.
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ...కెరీర్ ప్రారంభంలో వచ్చే విజయం ఎప్పటికీ గుర్తుంటుంది. ఆ టైమ్ లో వచ్చే షీల్డ్ ను పదిలంగా దాచుకుంటాం. తేజు కెరీర్ లో యాభై రోజులు పూర్తి చేసుకున్న చిత్రంగా సుప్రీమ్ ఎప్పటికీ గుర్తుంటుంది. అనిల్ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. సమ్మర్ లో జన్యూన్ హిట్ ఇది అన్నారు.
రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ...ప్రస్తుతం తెలుగు సినిమా ఇన్ని రోజులు ఆడుతుంది అనే లెక్క పోయింది. ఇప్పుడున్న మార్కెట్ విధానమే మారిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో సుప్రీమ్ సినిమా యాభై రోజులు ఆడడం సంతోషంగా ఉంది. అనిల్ రెండో సినిమా కూడా హిట్ అయ్యింది. సాయి ఈ సినిమాలో పాత్రకు తగ్గట్టు అద్భుతంగా నటించాడు అన్నారు.
ఈ కార్యక్రమంలో రఘుబాబు, శేషు, రాఘవ, శ్రీనివాస్ రెడ్డి, జె.పి తదితరులు పాల్గొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments