పవన్ కు కలిసొచ్చిన తేదీల్లో వస్తున్న సూపర్ స్టార్స్
Send us your feedback to audioarticles@vaarta.com
బద్రి (2000), ఖుషి (2001).. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిపోయిన చిత్రాలివి. ఈ రెండు చిత్రాలు కూడా రెండు వరుస సంవత్సరాల్లో వేసవి సందర్భంగా విడుదలై ఘనవిజయం సాధించాయి. ఇప్పుడు ఈ రెండు సినిమాల విడుదల తేదీలను టార్గెట్ చేసుకుంటూ ఇద్దరు సూపర్ స్టార్ల సినిమాలు ఈ వేసవికి సందడి చేయబోతున్నాయి. కాస్త వివరాల్లోకి వెళితే.. మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్లో శ్రీమంతుడు వంటి విజయవంతమైన చిత్రం తరువాత భరత్ అనే నేను పేరుతో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. తొలుత ఈ సినిమాని ఏప్రిల్ 27న విడుదల చేయాలనుకున్నారు.
అదే రోజున అల్లు అర్జున్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియాని కూడా విడుదల చేయాలనుకున్నారు. అయితే.. అనూహ్యంగా ఇదే తేదికి రజనీకాంత్ కాలా విడుదల కాబోతుందంటూ ప్రకటన వచ్చింది. దీంతో ఈ రెండు సినిమాలు ఏప్రిల్ 26కి ప్రీ పోన్ అయ్యాయి. ఒకే రోజు అనవసరమైన పోటీ ఎందుకని.. భరత్ అనే నేనుని ఏప్రిల్ 20కి, నా పేరు సూర్యని మే 4కి విడుదల చేసే దిశగా ఆయా చిత్రాల నిర్మాతలు ఒప్పందం కుదుర్చుకున్నారు.
దీంతో.. ఏప్రిల్ 20కి భరత్ అనే నేను, ఏప్రిల్ 27కి కాలా, మే 4కి నా పేరు సూర్య.. వారం రోజుల వ్యవధిలో విడుదల కాబోతున్నట్లయ్యింది. ఇక్కడ విశేషమేమిటంటే.. పవన్ బద్రి విడుదలైన ఏప్రిల్ 20కి భరత్ అనే నేను రానుండగా.. ఖుషి విడుదల తేదిన అయిన ఏప్రిల్ 27న కాలా రాబోతోంది. అంటే.. పవర్ స్టార్ బ్లాక్‌బస్టర్ చిత్రాల డేట్స్‌కి రెండు భాషల సూపర్ స్టార్ల సినిమాలు రాబోతున్నాయన్నమాట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com