నూత‌న సంవ‌త్స‌ర సంద‌ర్భంగా అభిమానుల‌తో సూప‌ర్ స్టార్..!

  • IndiaGlitz, [Wednesday,January 04 2017]

నూతన సంవత్సర సందర్భంగా ఆల్ ఇండియా కృష్ణ మహేష్ ప్రజా సేన రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ఖాదర్ ఘోరీ, సూపర్ స్టార్ కృష్ణ ,విజయనిర్మల హీరో నరేష్ ల కు శుభాకాంక్షలు తెలియజేసారు . ఈ సందర్బంగా హీరో కృష్ణ కేక్ కట్ చేసి మా అభిమానులు ప్రతి సందర్భం లోను జయాపజయాల‌తో సంబంధం లేకుండా మమ్మల్ని కలుస్తూ వాళ్ళ అభిమానం చాటడం ద్వారా మాకు శక్తి ని పెంచుతున్నారు అని ధన్యవాదాలు తెలియజేసారు . పల్లె జంగయ్య గౌడ్ , కిరణ్ , జహంగీర్, సంపత్, తదితర అభిమానులు పాల్గొన్నారు .

సూపర్ స్టార్ట్ కృష్ణ మహేష్ సేన - కృష్ణ జిల్లా , (విజయవాడ ) ,కృష్ణ లంక , కృష్ణ టీ స్టాల్ , కృష్ణ మోహన్ రూపొందించిన టేబుల్ క్యాలెండరులను , హీరో కృష్ణ ఆవిష్కరించి విజయనిర్మల నరేష్ లకు అందజేశారు. ఈ సందర్భంగా కన‌క‌ దుర్గ అమ్మవారి చిత్ర ప‌టాన్ని కృష్ణ విజయ నిర్మల దంపతులకు అందజేశారు . ఈ కార్యక్రమంలో . ముట్ట గంగాధర్ , సి . కృష్ణ కన్నా రావు , జె.బి.వి శర్మ , మూర్తి , తదితరులు పాల్గొన్నారు .