నితిన్ వేడుకకు సూపర్ స్టార్
Send us your feedback to audioarticles@vaarta.com
యూత్‌స్టార్ నితిన్ హీరోగా వెంకట్ బోయనపల్లి సమర్పణలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లిమిటెడ్ పతాకంపై హను రాఘవపూడి దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనీల్ సుంకర నిర్మిస్తున్న భారీ చిత్రం 'లై' (లవ్ ఇంటెలిజెన్స్ ఎన్‌మిటి).
ఈ చిత్రం ఆగస్ట్ 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే రెండు పాటలు 'బాంభాట్', 'మిస్ సన్షైన్స సహా లగ్గం సాంగ్ 'ఏడమ్మా ఏడే ఏడేడే వరుడే..` మంచి స్పందనను రాబట్టుకున్నాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఆగస్ట్ 9న జరుగనుంది. సాధారణంగా నితిన్ సినిమాలంటే పవన్‌కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరవుతుంటాడు. కానీ ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు మాత్రం సూపర్‌స్టార్ మహేష్ ముఖ్య అతిథిగా హాజరవుతాడని ఫిలింనగర్ వర్గాల సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments