అన్నయ్య ఆశీర్వాదం తీసుకున్న సూపర్‌స్టార్
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ రజినీకాంత్ తమిళనాడు రాజకీయాల్లోకి రావడం పక్కా అయ్యింది. ఇటీవల తన అభిమాన సంఘ నాయకులతో ప్రత్యేకంగా సమావేశమైన రజినీరాంత్ డిసెంబర్ 31న పార్టీ పేరుని అనౌన్స్ చేస్తానని, జనవరిలో పార్టీని స్టార్ట్ చేస్తానని అనౌన్స్ చేశారు. దీంతో తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో వేడి రాజుకుంది. రజినీకాంత్ తన రాజకీయ పార్టీకి సంబంధించిన పనులను నెమ్మదిగా ప్రారంభించేశాడు. రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తానని చెప్పగానే కొందరు ఆయన రాకను స్వాగతించారు. మరికొందరు ఆయన రాకను విమర్శించారు. ఆధ్యాత్మిక రాజకీయాలను తాను ప్రారంభిస్తానని రజినీకాంత్ చెప్పడం కూడా విమర్శలకు తావిస్తుంది. అయితే రజినీకాంత్ తనపై వస్తున్న విమర్శలను పట్టించుకోలేదు. తన శ్రేయోభిలాషులను కలిసే పనిలో ఉన్నారు రజినీ. ఈరోజు తన అన్నయ్య సత్యనారాయణను కలుసుకున్నారు. ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. సత్యనారాయణ తమ్ముడు కొత్త రంగంలోకి ప్రవేశిస్తుండటంపై శుభాకాంక్షలను తెలిపారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది మే నెలలో జరగనున్నాయి. ఇంత తక్కువ సమయంలో రజినీకాంత్ తన పనులను ఎలా పూర్తి చేసి ప్రచారాన్ని చేసుకుంటారు. అసలు ఆయన పార్టీ ఎజెండా ఏంటి? జెండా ఎలా ఉండబోతుంది? అనే అంశాలు అందరిలో ఆసక్తిని నెలకొల్పాయి. మరి సినీ కెరీర్‌లో సూపర్‌స్టార్ అయిన రజినీకాంత్.. రాజకీయాల్లో సూపర్‌స్టార్ అవుతారో లేదో తెలియాలంటే కొన్నిరోజులు ఆగక తప్పదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout