‘సరిలేరు..’లో సూపర్‌స్టార్ పాత్ర తెలిసిపోయింది!
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ మహేష్ హీరోగా దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్‌టైనర్ ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్ విజయశాంతి నటిస్తున్నారు. జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్నివిడుదల చేస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్స్ పరంగా దూసుకెళ్లున్న చిత్రబృందం మెగాసూపర్ ఈవెంట్‌ను జనవరి 5న అశేష అభిమానుల సమక్షంలో పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో దర్శకనిర్మాతలు, నటీనటులు స్పెషల్ ఇంటర్వ్యూలు ఇస్తూ మహేశ్ ఫ్యాన్స్‌ను మరింత ఊరిస్తున్నారు.
ఇదే ఇంటర్వ్యూలో సూపర్‌స్టార్ కృష్ణ ‘సరిలేరు..’లో స్పెషల్ ఎంట్రీ ఇస్తున్నారని డైరెక్టర్ అనిల్ రావిపూడి స్వయానా చెప్పారు. అయితే ఆయన రోల్ ఏంటి..? ఎంతసేపు ఉంటుంది..? అనే విషయాలు మాత్రం సస్పెన్స్ అని.. అవేమీ అడగొద్దని తిన్నగా తప్పించుకున్నాడు డైరెక్టర్. ఇంతకీ ఆయన పాత్ర ఎలా ఉంటుంది..? అనే విషయం తాజాగా లీకయ్యింది. సినిమాలో రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతాయట. ఆ గొడవతో రెండు కుటుంబాలకు చెందిన సభ్యుల మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనేంత రీతిలో పరిస్థితులుంటాయట.
ఈ క్రమంలో పెద్ద మనిషిగా రంగంలోకి దిగి కృష్ణ పంచాయితీ చేసి ఇరు కుటుంబాలను కలుతారట. సరిగ్గా మూడు లేదా ఐదు నిమిషాలు మాత్రమే కృష్ణ పాత్ర ఉంటుందట. ఈ సెటిల్మెంట్ అయ్యాక అప్పుడు రష్మిక- మహేశ్ వివాహం జరుగుతుందట. ప్రస్తుతం ఈ రూమర్ అటు నెట్టింట్లో.. ఇటు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఇందులో నిజమెంతో తెలియాలంటే జనవరి 11వరకు వేచి చూడక తప్పదు మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com