బ్రహ్మోత్సవం టీజర్ పై క్రిష్ణ స్పందన
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్న చిత్రం బ్రహ్మోత్సవం. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్ లో పి.వి.పి సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. మహేష్ సరసన సమంత, కాజల్, ప్రణీత నటిస్తున్నారు. సత్యరాజ్, జయసుధ, రేవతి, నరేష్, రావు రమేష్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. నూతన సంవత్సర కానుకగా బ్రహ్మోత్సవం టీజర్ ను రిలీజ్ చేసారు. ఈ టీజర్ కు అనూహ్య స్పందన లభిస్తోంది.
ఈ సందర్భంగా బ్రహ్మోత్సవం టీజర్ గురించి క్రిష్ణ స్పందిస్తూ...బ్రహ్మోత్సవం టీజర్ చూసాను. చాలా బాగుంది. మహేష్ ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నింటి కన్నా...ఈ సినిమాలో చాలా అందంగా కనిపిస్తున్నాడు. టీజర్ చూస్తుంటే ఇది ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని తెలుస్తుంది. సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ 29న బ్రహ్మోత్సవం రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. సమ్మర్ రిలీజ్ అయ్యే సినిమాల్లో బ్రహ్మోత్సవం నెంబర్ వన్ గా నిలుస్తుందని ఆశిస్తున్నాను అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com