మరో యువ దర్శకుడితో సూపర్ స్టార్...
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో సినిమా చేయాలని అందరూ దర్శకులు కో్రుకుంటారు. ఇప్పుడు మరో యువ దర్శకుడికి అలాంటి అవకాశమే వచ్చింది. వివరాల్లోకెళ్తే.. తెలుగు, తమిళంలో విజయవంతమైన `పిజ్జా` సినిమాను తెరకెక్కించిన దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు తర్వాత సిద్ధార్థ్, బాబీ సింహలతో `జిగర్ తండా` మూవీ చేశాడు.
ఈ సినిమాలో బాబీ సింహకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది. తర్వాత విజయ్ సేతుపతి ఓ సినిమా చేసిన కార్తీక్ సుబ్బరాజు ఇప్పుడు ప్రభుదేవాతో `మెర్క్యురీ` అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కార్తీక్ సుబ్బరాజు సినిమా ఉంటుంది. ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మించనుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. రాజకీయాల మాటేమో కానీ రజనీకాంత్ వరుస సినిమాలు చేస్తుండటం సినీ అభిమానులకు ఊరటనిచ్చే అంశమే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments