ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు : చీఫ్ గెస్ట్‌గా రజనీకాంత్... ఒకే వేదికపై తలైవా, చంద్రబాబు, బాలయ్య
Send us your feedback to audioarticles@vaarta.com
పౌరాణికమైనా, సాంఘీకమైన, జానపదమైన తనదైన అద్భుతమైన నటనతో వెండితెర వేల్పుగా తెలుగు ప్రేక్షుకుల హృదయాల్లో సుస్ధిర స్ధానం సంపాదించుకున్నారు అన్న నందమూరి తారక రామారావు. హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా, రాజకీయ నాయకునిగా తెలుగు సినీ ప్రతిష్ఠని, తెలుగు జాతి గౌరవాన్ని నిలిపిన యుగ పురుషుడు ఆయన.
ఎన్టీఆర్ పిలుపే ఓ ప్రభంజనం :
కథానాయకుడిగా తనకు ఎంతో కీర్తి ప్రతిష్టలను అందించిన ప్రజలకు ఏమైనా చేయాలనే ఉద్దేశ్యంతో ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఎన్టీఆర్ సినీ ప్రస్థానమే కాదు పొలిటికల్ ఎంట్రీ కూడా ఓ సంచలనమే. తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం తొమ్మిది నెలల్లోనే ఆ పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత ఎన్టీఆర్. తద్వారా ఆంధ్రప్రదేశ్‌లో దశాబ్దాలుగా వేళ్లూనుకుపోయిన కాంగ్రెస్ పార్టీ పీఠాన్ని కదిలించిన తొలి వ్యక్తి ఎన్టీఆర్. ఆయన పిలుపు ఓ నవ్యోపదేశం, ఆయన పలుకు ఓ సంచలనం.. ఆయన మాట ఓ తూటా.. ఆయన సందేశమే స్పూర్తి. తెలుగు జాతిపై అంతటి ముద్ర వేసిన ఆ మహనీయుని శతజయంతి వేడుకలు గతేడాది మే 28న ప్రారంభమైన సంగతి తెలిసిందే.
ఒకే వేదికపై రజనీ, చంద్రబాబు, బాలకృష్ణ:
ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల నేపథ్యంలో సూపర్‌స్టార్ రజనీకాంత్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఒకే వేదికను పంచుకోనున్నారు. ఈ నెల 28న విజయవాడ శివారులో వున్న పోరంకి అనుమోలు గార్డెన్స్‌లో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు జరగనన్నాయి. ఈ సందర్భంగా అన్నగారి చారిత్రక ప్రసంగాలు, అసెంబ్లీలో చేసిన ప్రసంగాలతో కూడిన పుస్తకావిష్కరణతో పాటు మరిన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
ఎన్టీఆర్‌తో విడదీయరాని అనుబంధం :
ఇకపోతే.. ఎన్టీఆర్, రజనీకాంత్‌ల మధ్య ప్రత్యేకమైన అభిమానం వుంది. రజనీ బస్ కండక్టర్‌గా పనిచేసే రోజుల్లో అన్నగారి సినిమాలు చూసేవారట. ముఖ్యంగా ఎన్టీఆర్ నటించిన పౌరాణిక చిత్రాలంటే బాగా ఇష్టమని రజనీ పలుమార్లు చెప్పారు. ఇక ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత చెన్నైలో ఎన్టీఆర్‌ను పలుమార్లు కలుసుకోవడంతో పాటు వీరిద్దరూ కలిసి ‘‘టైగర్’’ అనే సినిమాలో కలిసి నటించారు . ఇక హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా అన్నగారిని కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకునేవారు రజనీకాంత్. అలాగే నందమూరి కుటుంబంతోనూ రజనీకి సత్సంబంధాలే వున్నాయి. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు రజనీ హాజరుకానున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments