Rajinikanth : తిరుమల నుంచి నేరుగా కడప దర్గాకి తలైవా, వెంట ఏఆర్ రెహమాన్.. ప్రత్యేక ప్రార్థనలు
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth), ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ (A. R. Rahman)లు కడపలోని ప్రఖ్యాత అమీన్‌పీర్ దర్గాను దర్శించుకున్నారు. తలైవా వెంట ఆయన కుమార్తె ఐశ్వర్య (Aishwarya Rajinikanth), రెహమాన్ వెంట ఆయన కుమారుడు అమీన్లు వున్నారు. ఈ సందర్భంగా దర్గా పీఠాధిపతిని కలిసిన రజనీ.. ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. అనంతరం దర్గా విశిష్టతను అడిగి తెలుసుకున్నారు.
రజనీ, రెహమాన్ (A. R. Rahman)లను చూసేందుకు ఎగబడ్డ జనం:
ఇక దర్గా సంప్రదాయం ప్రకారం.. ఏఆర్ రెహమాన్‌కు, రజనీకాంత్‌కు దర్గా పెద్దలు తలపాగా చుట్టారు. రజనీ (Rajinikanth), ఏఆర్ రెహమాన్ (A. R. Rahman) ల రాక గురించి తెలుసుకున్న అభిమానులు, ప్రజలు భారీగా చేరుకున్నారు. దీంతో అక్కడ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. దాదాపు రెండు గంటల పాటు దర్గా ప్రాంగణంలోనే వీరిద్దరూ గడిపారు. అనంతరం కడప విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో చెన్నైకి బయల్దేరి వెళ్లారు.
కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సూపర్‌స్టార్:
అంతకుముందు తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు రజనీకాంత్. బుధవారం రాత్రి తిరుమలకు చేరుకున్న సూపర్‌స్టార్‌కు శ్రీకృష్ణ అతిథి గృహం వద్ద టీటీడీ అధికారులు, సిబ్బంది ఘన స్వాగతం పలికారు. అనంతరం బస ఏర్పాట్లు చేశారు. గురువారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారి సుప్రభాత సేవ కార్యక్రమంలో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు రజనీకాంత్ (Rajinikanth). పూజల అనంతరం వారికి ఆలయ పండితులు వేదాశీర్వచనం అందించగా.. అధికారులు తీర్ధ ప్రసాదాలు అందజేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com